నారాయణపేట జిల్లా మక్తల్ మండలం ముస్లాయపల్లి గ్రామ సమీపంలో వెలసిన శ్రీ చెన్న బసవేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు ఐదు రోజుల పాటు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. స్వామివారి బ్రహ్మోత్సవాలకు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వస్తారని పేర్కొన్నారు. దాదాపు ఐదు శతాబ్దాల నుంచి స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా వివిధ కార్యక్రమాలతో పాటు బండలాగుడు పోటీలు నిర్వహించారు.
ఇవీ చూడండి:అంతా మీ ఇష్టమేనా: సుప్రీంకోర్టు