బాలీవుడ్ బెబో కరీనాకపూర్.. గతంలో నటుడు షాహిద్ కపూర్‌తో జరిపిన ప్రేమాయణం గురించి పెదవి విప్పింది. కొన్నేళ్ల పాటు డేటింగ్‌లో ఉన్న వీరిద్దరు వ్యక్తిగత కారణాల వల్ల విడిపోయారు. ప్రస్తుతం షాహిద్, కరీనా వ్యక్తిగతంగా, వృత్తిపరంగా సంతోషంగా జీవిస్తున్నారు. తాజాగా కరీనాకపూర్‌ను ఓ ఛానెల్ ఇంటర్వ్యూ చేసింది. ఇందులో భాగంగా కరీనా.. షాహిద్‌తో బ్రేకప్ గురించి స్పందించింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
" 'జబ్ వి మెట్' సినిమా నా కెరీర్‌నే మార్చేసింది. ఈ సినిమాలో షాహిద్ నేను కలిసి నటించాం. నిజం చెప్పాలంటే ఆ సినిమా కథను మొదట షాహిద్ విన్నాడు. 'జబ్ వి మెట్' కథ చాలా బాగుంది. ఆ కథలో అమ్మాయి పాత్ర ఉన్నతంగా ఉంది. నువ్వు తప్పకుండా ఆ సినిమా చెయ్యి అని షాహిద్ చెప్పాడు. అలా నేను ఆ సినిమాలో నటించాను. 'జబ్ వి మెట్', 'తషాన్' సినిమాలకు మధ్య మా ఇద్దరి జీవితాల్లో చాలా జరిగింది. విధికి ఓ ప్రత్యేకమైన ప్లాన్ ఉంది.. అందుకనే విడిపోయాం. మా దారులు మేము చూసుకున్నాం"
-- కరీనా కపూర్, బాలీవుడ్ నటి
అనంతరం 'తషాన్' సినిమా గురించి స్పందించిన కరీనా.. "తషాన్ సినిమా షూటింగ్‌లో సైఫ్‌ను కలిశాను. అయితే ఈ సినిమా కెరీర్‌తోపాటు నా జీవితాన్ని కూడా మారుస్తుందని భావించాను. నిజం చెప్పాలంటే 'జబ్ వి మెట్' నా కెరీర్‌ని మారిస్తే.. 'తషాన్' నా జీవితాన్ని మార్చేసింది. ఎందుకంటే ఆ సినిమాలో నేను నా కలల రాకుమారుడిని కలిశాను. అతన్నే ప్రేమించి, పెళ్లి చేసుకున్నాను" అని చెప్పింది.
తొలుత సైఫ్ ప్రేమను అంగీకరించలేదని చెప్పిన కరీనా.. ఆ తర్వాత చాలా రోజులు ఇద్దరి మధ్య ప్రేమ నడిచిందని చెప్పింది. కరీనా-సైఫ్ జోడి 2012లో వివాహబంధంతో ఒకటయ్యారు. వీరికి తైమూర్ అలీఖాన్ అనే కుమారుడు ఉన్నాడు. ప్రస్తుతం వీరిద్దరు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. కరీనా కపూర్ ప్రస్తుతం 'లాల్ సింగ్ చద్దా'లో నటిస్తోంది.
ఇదీ చదవండి..