దేశ ప్రజలు భాజపాకు అఖండ విజయాన్ని కట్టబెట్టారని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ ఆనందం వ్యక్తం చేశారు. మోదీ హవా తెలంగాణలోనూ ఉందని తొలిసారిగా స్వతహాగా 4 సీట్లు సాధించబోతున్నామన్నారు. రాష్ట్రంలో తెరాసకు అసలైన ప్రతిపక్షం తామేనన్నారు. త్వరలో తెరాసలో లుకలుకలు ప్రారంభమవుతాయన్నారు. భవిష్యత్ తెలంగాణ భాజపాదేనని ధీమా వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి: కాషాయ సునామీ 2.0: సర్వం మోదీమయం