గత ఐదేళ్లలో తెరాస ప్రభుత్వం స్థానిక సంస్థలకు ఒక్క రూపాయి ఇవ్వలేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. సచివాలయంకు రాని ముఖ్యమంత్రి పాలన విధానంపై మాట్లాడటం చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని ఎద్దేవా చేశారు. ఏ అధికారులైనా అవినీతికి పాల్పడుతున్నారంటే అది మీ వల్లనేనని కేసీఆర్ వల్లేనని ఆరోపించారు. ఎన్నికల్లో ఖర్చు చేసిన వెయ్యి కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయని జీవన్ రెడ్డి సీఎంను నిలదీశారు.
ఇవీ చూడండి:రజత్ ఓటర్ ఐడీ కేసులో అయోమయంలో పోలీసులు