భారత పురుషుల హాకీ జట్టుకు కొత్త కోచ్‌గా ఆస్ట్రేలియాకు చెందిన గ్రాహం రీడ్‌ను నియమించారు. హాకీ ఇండియా, సాయ్ మధ్య మంగళవారం జరిగిన భేటీలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. 2022 హాకీ ప్రపంచకప్ వరకు ఆయన బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఈ వారం చివరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది.
ప్రస్తుతం ఎన్నికల సందడిలో ఉన్న కేంద్ర క్రీడా శాఖ మంత్రి రాజ్యవర్ధన్.. ఈ విషయంపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు.
ఆస్ట్రేలియా తరఫున 130 అంతర్జాతీయ హాకీ మ్యాచ్‌లాడిన గ్రాహం, 1992 ఒలింపిక్స్‌లో వెండి పతకం సాధించిన జట్టులో సభ్యుడు. 2016 రియో ఒలింపిక్స్‌లో ఆస్ట్రేలియా పురుషుల హాకీ జట్టుకు కోచ్‌గానూ వ్యవహరించాడు.
భారత జట్టు అజ్లన్ షా హాకీ టోర్నీలో అదరగొడుతోంది. ప్రస్తుతం టీం డైరక్టర్‌గా ఉన్న డేవిడ్ జాన్, అనలిటికల్ కోచ్ క్రిస్ సిరియేల్లమ్ కూడా ఆస్ట్రేలియాకు చెందిన వారే కావడం విశేషం.
ఇవీ చదవండి: