యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం అక్కంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వలిగొండకు చెందిన మొగిళ్ళ శ్రీనివాస్ పని నిమిత్తం ద్విచక్రవాహనంపై భువనగిరికి బయలుదేరాడు. అక్కంపల్లి వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న కారు ఢీకొంది. ప్రమాదంలో శ్రీనివాస్‌కు తీవ్ర గాయాలయ్యాయి. బాధితున్ని చికిత్స నిమిత్తం భువనగిరి ఆస్పత్రికి తరలించారు.
ఇవీ చూడండి: బావిలో పడి బతికొచ్చాడు...