భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఛైర్మన్, రాకెట్ మ్యాన్‌గా పేరొందిన డాక్టర్ శివన్‌కు తమిళనాడు ప్రభుత్వం అబ్దుల్ కలాం పురస్కారం ప్రకటించింది. శాస్త్ర- సాంకేతిక రంగాల్లో పురోగతికి కృషి, విద్యార్థులకు అంతరిక్ష పరిజ్ఞానంపై అవగాహన కల్పించడంలో ఆయన చూపిన చొరవను గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేసింది. పురస్కారం కింద ఎనిమిది గ్రాముల బంగారు కానుక, రూ. 5 లక్షల నగదు అందజేయనున్నారు.
శివన్ సారథ్యంలో ఇస్రో గత నెలలో చంద్రయాన్-2ను రోదసిలోకి విజయవంతంగా పంపింది. ఆయన తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాకు చెందినవారు. 1983లో ఇస్రోలో శాస్త్రవేత్తగా చేరి, వివిధ హోదాల్లో పనిచేశారు. జీఎస్ఎల్వీ క్రయో దశ అభివృద్ధిలో కీలక భూమిక పోషించారు.
ఇస్రోలో ఉపగ్రహాన్ని, రాకెట్‌ను ప్రయోగించడానికి ముందు అది పనిచేసే తీరును పరీక్షించి, పర్యవేక్షించడానికి ఉపయోగపడే సాఫ్ట్‌వేర్‌కు శివన్ రూపకల్పన చేశారు. అంగారకుడిపైకి పంపిన 'మామ్' ప్రాజెక్టుకు నేతృత్వం వహించారు. ఆయన సారథ్యంలో మూడేళ్లలో తిరుగులేని క్రయోజనిక్ ఇంజిన్‌ను తయారుచేశారు.