ETV Bharat / briefs

ఆ చెట్టుకు ఏడాదికి ఒకటే బోండాం...!!!

ఎన్నో ఔషధ గుణాలున్న కొబ్బరి నీళ్ళంటే అందరికి ఇష్టమే. సాధారణంగా కొబ్బరిచెట్టుకు గుత్తులు గుత్తులుగా బోండాలుంటాయి. కానీ కర్ణాటకలోని ఈ అరుదైన చెట్టుకు ఏడాదికి ఒక్కటంటే... ఒక్కటే బోండాం కాస్తుంది.

కొబ్బరి
author img

By

Published : Feb 10, 2019, 12:11 AM IST

కొబ్బరి
కర్ణాటకలో ఒక అరుదైన కొబ్బరిచెట్టు అందరినీ ఆకర్షిస్తోంది. ఏడాదికి ఒక్కటే కొబ్బరి బోండాన్ని కాస్తోంది ఈ చెట్టు. 1960 నుంచి కాసిన ప్రతీ బోండాన్ని రైతు సేకరిస్తున్నాడు.
undefined

ఎమ్​ ఎన్​ నరసింహయ్యకు చెందిన ఈ అరుదైన కొబ్బరిచెట్టు యలందూర్ వద్ద జాతీయ రహదారి సమీపంలోని మద్దూర్ గ్రామంలో ఉంది.

"1930లో దీన్ని నాటిప్పటికీ... 1950 వరకు చెట్టుకు ఒక్క బోండాం కూడా కాయలేదు. చెట్టును నరికేయాలనుకున్నాము. ఆ సమయంలోనే ఒక బోండాం కాసింది. దాని బరువు చూసి అశ్చర్యపోయాను. వాటన్నింటిని జాగ్రత్తగా భద్రపరుస్తున్నాను." --- నరసింహయ్య, రైతు.

6 ఎకరాల విస్తీర్ణంలో సుమారు 500 కొబ్బరి చెట్లు ఉన్నాయి. ఏడాదికి ఒక్కటే కాసినా... దీని బరువు 3-5 బోండాలతో సమానంగా ఉంటుందని వివరించాడు. అప్పటి నుంచి ఏడాదికి ఒక్క బోండాం మాత్రమే కాసినప్పటికీ ఆ చెట్టును కొట్టేయకుండా అపురూపంగా చూసుకుంటున్నాడు నరసింహయ్య.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.