లంచం తీసుకుంటూ ఎన్నిసార్లు దొరికినా అధికారుల తీరు మారడం లేదు. ఇటీవల కీసర తహసీల్దార్ కోటి 10 లక్షలు లంచం తీసుకుంటూ పట్టబడ్డాడు. గతంలో తహసీల్దార్ లావణ్య సైతం పట్టుబడింది. ఇప్పడు తాజాగా ఓ ల్యాండ్ సర్వేయర్ సూపరింటెండెంట్ డబ్బులు తీసుకుంటూ దొరికిపోయాడు.
భూమికి సంబంధించిన సర్వే నివేదిక ఇవ్వడానికి లంచం తీసుకుంటున్న రంగారెడ్డి జిల్లా ల్యాండ్ సర్వేయర్, సూపరింటెండెంట్ వెంకటేశ్వర్‌రెడ్డి అనిశాకు చిక్కాడు. భూ సర్వే నిర్వహించిన వెంకటేశ్వర్‌రెడ్డి అందుకు సంబంధించిన నివేదిక ఇవ్వడానికి.. భూ యజమాని వద్ద ఐదు వేల రూపాయల లంచం డిమాండ్ చేశాడు. ఈ తరుణంలో భూ యజమాని అనిశా అధికారులను ఆశ్రయించాడు. సర్వేయర్ బాధితుడి వద్ద నుంచి ఐదు వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా అధికారులు దాడి చేసి పట్టుకున్నారు.
ఇదీ చూడండి : ఆ నగరంలో వరద.. మోకాలి లోతుకు చేరింది