ETV Bharat / crime

వర్షానికి కూలిన ఇంటిగోడ.. ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి.. మరో ఇద్దరికి... - five dead after wall collapse in kothapally

five-laborers-dead-in-kottapalli-jogulamba-gadwala-district

author img

By

Published : Oct 10, 2021, 7:50 AM IST

Updated : Oct 10, 2021, 3:10 PM IST

07:49 October 10

రాత్రి కురిసిన వర్షానికి కూలిన ఇంటి గోడ... ఐదుగురు మృతి

వర్షానికి కూలి ఇంటిగోడ.. ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి.. మరో ఇద్దరు...

రోజూలాగే అందరూ కలిసి భోజనం చేశారు. అమ్మా నాన్న టీవీ చూస్తుంటే.. పిల్లలంతా ఆడుకున్నారు. సమయం కాగానే నిద్రకు ఉపక్రమించారు. ప్రతిరోజూలాగే మరో కొత్తరోజుకు నాంది పలుకుతామనే ఆశతో.. మరుసటి రోజు తమ జీవితంలో ఏ కొత్తదనాన్ని తీసుకొస్తుందోనన్న ఆలోచనతోనే అంతా నిద్రపోయారు. కానీ.. తిరిగి కళ్లు తెరవలేమని ఊహించలేకపోయారు. గాఢనిద్రలో ఉండగా ఒక్కసారిగా పిడుగుపడ్డట్లు వారి మీద పడిన గోడ.. ఆ ఇంట్లో ఐదుగురి ప్రాణాలను బలితీసుకుంది. 

జోగులాంబ గద్వాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. అయిజ మండలం కొత్తపల్లిలో గోడ కూలి ఐదుగురు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మృతులు మోషా, శాంతమ్మ, చరణ్, రాము, తేజగా గుర్తించారు. రాత్రి నిద్రిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు స్థానికులు భావిస్తున్నారు. వర్షానికే ఇంటి గోడ కూలిందని చెబుతున్నారు. 

మరోవైపు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం, మృతులను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. వర్షాలు కురిసేటప్పుడు శిథిలావస్థకు చేరిన ఇళ్లలో ఉండకూడదని.. అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 

Last Updated : Oct 10, 2021, 3:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.