ETV Bharat / state

Huzurabad Bypoll:హుజూరాబాద్ అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్​.. ఎవరంటే..?

author img

By

Published : Oct 2, 2021, 6:51 PM IST

Updated : Oct 2, 2021, 7:28 PM IST

congress party announced huzurabad candidate

18:49 October 02

హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు

హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా బల్మూరి వెంకట్‌
balmuri venkat narsing rao
బల్మూరి వెంకటనర్సింగ్​ రావు

హుజూరాబాద్ ఉపఎన్నికకు కాంగ్రెస్​ పార్టీ ఎట్టకేలకు అభ్యర్థి(huzurabad congress candidate)ని ఖరారు చేసింది. ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బల్మూరి వెంకటనర్సింగ్​ రావును హుజూరాబాద్​ అభ్యర్థి(huzurabad congress candidate)గా అధిష్ఠానం ప్రకటించింది.

యువ‌జ‌న కాంగ్రెస్ రాష్ట్ర కార్యద‌ర్శి తిప్పర‌పు సంప‌త్‌, కిసాన్ కాంగ్రెస్ క‌రీంన‌గ‌ర్ జిల్లా అధ్యక్షుడు ప‌త్తి కృష్ణారెడ్డి, ఎన్​ఎస్​యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బ‌ల‌మూరి వెంక‌ట్​.. పేర్లను పార్టీ నాయకత్వం పరిశీలించింది. చివరగా.. ఉమ్మడి కరీంనగర్​ జిల్లాకు చెందిన బల్మూరి వెంకటనర్సింగ్​ రావును ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. 

మాజీ మంత్రి ఈటల రాజేందర్​ రాజీనామాతో హుజూరాబాద్​లో ఉపఎన్నిక అనివార్యమైంది. తెరాస తరఫున బరిలో నిలిచిన గెల్లు శ్రీనివాస యాదవ్​.. ఇవాళ తన నామినేషన్​ వేశారు. భాజపా తరఫున ఈటల అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే అధికార తెరాస, భాజపాలు హుజూబాద్​ ఉప ఎన్నికలో దూసుకుపోతుండగా.. హస్తం పార్టీ మాత్రం అభ్యర్థిని ఎట్టకేలకు నేడు ప్రకటించింది.  హుజూరాబాద్​ ఉపఎన్నికల పోలింగ్​ అక్టోబర్ 30న జరగనుంది. నవంబర్ 2న ఓట్ల లెక్కింపు చేపడతారు.

ఇదీ చూడండి:

Last Updated : Oct 2, 2021, 7:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.