ETV Bharat / city

రెండు, మూడు నెలల్లో సంచలన వార్త చెప్తా..: సీఎం కేసీఆర్​ - CM KCR meeting With kumaraswamy

CM KCR said sensational news will be announced in two three months

author img

By

Published : May 26, 2022, 4:46 PM IST

Updated : May 26, 2022, 5:36 PM IST

16:42 May 26

రెండు, మూడు నెలల్లో సంచలన వార్త చెప్తా..: సీఎం కేసీఆర్​

రెండు, మూడు నెలల్లో సంచలన వార్త చెప్తా..

CM KCR Sensational Comments: దేశంలో గుణాత్మక మార్పు రావాల్సి ఉందని.. తొందర్లోనే తప్పకుండా వస్తుందని.. దాన్ని ఎవ్వరూ ఆపలేని సీఎం కేసీఆర్​ తెలిపారు. ఈ నేపథ్యంలోనే రెండు, మూడు నెలల తర్వాత ఓ సంచలన వార్త చెప్తానని సీఎం కేసీఆర్​ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బెంగళూరులో జేడీ(ఎస్‌) అధినేత దేవెగౌడ, ఆయన తనయుడు, మాజీ సీఎం కుమారస్వామితో కేసీఆర్‌ సమావేశమయ్యారు. మధ్యాహ్నం వారితో కలిసి భోజనం చేసిన సీఎం కేసీఆర్​.. అనంతరం సుమారు మూడు గంటల పాటు భేటీ అయ్యారు. జాతీయ, కర్ణాటక రాజకీయాలతో పాటు కీలక విషయాలపై చర్చించినట్టు సీఎం కేసీఆర్​ వెల్లడించారు.

స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్నా.. ఇప్పటికీ దేశంలో మంచినీరు, విద్యుత్‌, సాగునీటి కోసం ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదని సీఎం కేసీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. సంకల్పముంటే అమెరికా కంటే బలమైన ఆర్థికశక్తిగా భారత్‌ను తీర్చిదిద్దొచ్చని చెప్పారు. ఉజ్వల భారత్‌ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కేసీఆర్‌ పిలుపునిచ్చారు. గతంలో కర్ణాటకకు వచ్చినప్పుడు తాను చెప్పిన మాట నిజమైందని సీఎం కేసీఆర్​ గుర్తు చేశారు. ఎన్నికలకు ముందు కర్ణాటకకు వచ్చిన సమయంలో.. కుమారస్వామి ప్రమాణస్వీకారానికి వస్తానని చెప్పి వెళ్లానని.. అది అక్షరాల నిజమైందని వివరించారు. ఇప్పుడు కూడా జాతీయస్థాయిలో పెనుమార్పు రాబోతోందని.. దాన్ని ఎవ్వరూ ఆపలేరని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి రెండు, మూడు నెలల్లోనే ఓ సంచలన వార్త చెప్తామన్నారు.

"ఉజ్వల భారత్‌ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. కేంద్రంలో కాంగ్రెస్‌, భాజపా ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి. కాంగ్రెస్‌, భాజపా పాలనలో ఎవరూ సంతోషంగా లేరు. మహిళలు, యువత సహా ఎవరీలోనూ ఆనందం లేదు. చరిత్రలో ఎన్నడూ లేనంతగా రూపాయి విలువ పడిపోయింది. జీడీపీలో భారత్‌ను చైనా అధిగమించింది. దేశంలో గుణాత్మకమైన మార్పు రావాలి. జాతీయస్థాయిలో మార్పు వచ్చితీరుతుంది. దేశంలో వచ్చే మార్పును ఎవరూ ఆపలేరు. జాతీయ, కర్ణాటక రాజకీయాలపై మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామితో చర్చించాం. రెండు, మూడు నెలల్లో సంచలన వార్త చెప్తాం." - కేసీఆర్​, సీఎం

ఇవీ చూడండి:

Last Updated : May 26, 2022, 5:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.