Sansad TV Hack: సంసద్ టీవీ యూట్యూబ్ ఛానల్ హ్యాక్ అయింది. దుండగులు 'ఇథీరియమ్(క్రిప్టో కరెన్సీ)' అని పేరు కూడా మార్చారని సంసద్ టెలివిజన్ పేర్కొంది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన యూట్యూబ్ యాజమాన్యం సంసద్ టీవీ అకౌంట్‌ను నిలిపివేసింది. యూట్యూబ్ కమ్యూనిటీ మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు అకౌంట్ బ్లాక్ చేసినట్లు పేర్కొంది.
హ్యాకింగ్ లాంటిదేదో జరిగిందని తెలిపిన యూట్యూబ్.. దీనిపై గూగుల్‌కు ఫిర్యాదు చేశామని, అధికారులు పరిశీలిస్తున్నట్లు స్పష్టం చేసింది.
పార్లమెంట్ ఉభయ సభల టీవీ ఛానళ్లను కలిపి ఏర్పాటైన సంసద్ టీవీ గతేడాది సెప్టెంబర్ 15న ప్రారంభమైంది. దీనికి సంబంధించిన కార్యక్రమాలను ప్రసారం చేసేందుకు యూట్యూబ్ ఛానల్‌ను కూడా ఏర్పాటు చేసింది కేంద్రం.
ఇవీ చూడండి: ప్లంబర్ టు పేస్ బౌలర్.. పేదింటి బిడ్డ క్రికెట్ ప్రయాణం!