ETV Bharat / bharat

''యూపీ కేరళలా మారితే..' యోగి భయమంతా అందుకే..!' - యూపీ కేరళలా మారితే యోగి వ్యాఖ్యలు

Yogi on Kerala: సీఎం యోగి ఆదిత్యనాథ్‌ చేసిన వ్యాఖ్యలపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కౌంటర్‌ ఇచ్చారు. ఉత్తర్‌ప్రదేశ్‌ కేరళలా మారిపోతే ప్రజలకు మంచి విద్య, నాణ్యమైన వైద్య సేవలు, సామాజిక సంక్షేమం, మంచి జీవన ప్రమాణాలు, మతాలు, కులాల పేరిట హత్యల్లేని ఓ సామరస్య సమాజం ఏర్పడుతుందనే యోగి ఆదిత్యనాథ్‌ భయపడుతున్నారంటూ చురకలంటించారు.

Up Elections 2022
యోగి
author img

By

Published : Feb 11, 2022, 4:45 AM IST

Yogi on Kerala: యూపీ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత ఎన్నికల వేళ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ చేసిన వ్యాఖ్యలపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కౌంటర్‌ ఇచ్చారు. భాజపాకు ప్రజలు ఓటు వెయ్యకుండా తప్పు చేస్తే.. ఉత్తరప్రదేశ్‌ కూడా ఓ కశ్మీర్‌, కేరళ, బెంగాల్‌లా మారుతుందన్న యోగి వ్యాఖ్యలపై ట్విటర్‌లో దీటుగా స్పందించారు. ఉత్తర్‌ప్రదేశ్‌ కేరళలా మారిపోతే ప్రజలకు మంచి విద్య, నాణ్యమైన వైద్య సేవలు, సామాజిక సంక్షేమం, మంచి జీవన ప్రమాణాలు, మతాలు, కులాల పేరిట హత్యల్లేని ఓ సామరస్య సమాజం ఏర్పడుతుందనే యోగి ఆదిత్యనాథ్‌ భయపడుతున్నారంటూ చురకలంటించారు. యూపీ ప్రజలు ఇలాంటి అభివృద్ధే కోరుకుంటున్నారని విజయన్‌ పేర్కొన్నారు.

మరోవైపు, కేరళలో సీపీఎం నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వం 100 రోజుల కార్యక్రమంలో భాగంగా చేపట్టిన కార్యక్రమాలను విజయన్‌ ట్విటర్‌లో వెల్లడించారు. ఈ కార్యక్రమం కింద రూ.17,183 కోట్ల వ్యయంతో చేపట్టిన 1,557 ప్రాజెక్టుల్లో భాగంగా 53 కొత్త పాఠశాల భవనాలను ప్రారంభించినట్టు తెలిపారు. ఆ పాఠశాలల భవనాలను ట్విటర్‌లో పంచుకున్నారు. తమ ప్రభుత్వం గత ఐదేళ్లలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన కోసం రూ.5వేల కోట్ల పెట్టుబడి పెట్టిందన్నారు. ఫలితంగా 9.34లక్షల కొత్త అడ్మిషన్లు వచ్చాయని వెల్లడించారు.

రాహుల్ ఏమన్నారంటే..?

UP Elections 2022: యోగి వ్యాఖ్యలనుద్దేశించి రాహుల్​.. భారత స్ఫూర్తిని అవమానించవద్దని అన్నారు. అనేక భాషలు, సంస్కృతుల సమ్మేళనమే ఈ దేశ బలం. కశ్మీర్​ నుంచి కేరళ వరకు గుజరాత్​ నుంచి బంగాల్​ వరకు భారత్ చాలా అందమైన దేశమని చెప్పారు. ఇలాంటి దేశాన్ని అవమానించవద్దని అన్నారు.

అద్భుతాలు జరుగుతాయి..!

యోగి వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశి థరూర్ స్పందించారు. కశ్మీర్ అందం, బంగాల్ సంస్కృతి, కేరళ విద్యతో ఉత్తర్​ప్రదేశ్​లో అద్భుతాలు జరుగుతాయని అన్నారు. భాజపా అధికారంలోకి రాకపోతేనే అది సాధ్యమవుతుందని చెప్పారు.

ఇదీ చదవండి: 'ఈడీ, సీబీఐ ఒత్తిడి నాపై పని చేయదు.. మోదీ చెప్పిందదే'

జర్నలిస్ట్ రానా ఆయుబ్​పై ఈడీ కొరడా.. భారీగా నిధులు సీజ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.