ETV Bharat / bharat

'తుపానులో చిక్కుకున్న ఓడలా భారత్​ పరిస్థితి' - rahul gandhi tweet on modi

దేశంలో కొవిడ్​-19 పరిస్థితి చూసి ప్రపంచమే వణుకుతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా కేసులు తగ్గినప్పుడు తన ఘనతగా చెప్పుకున్న మోదీ.. ఇప్పుడు ఉద్ధృతి పెరిగితే నెపం రాష్ట్రాలపై వేస్తున్నారని మండిపడ్డారు. 'ఆత్మనిర్భర్'​ అంటే ఇదేనా? అని ప్రశ్నించారు. దేశంలో వైరస్​ విజృంభణకు మోదీ, షాల భారీ ర్యాలీలే కారణమని ఆరోపించారు.

Rahul Gandhi
రాహుల్ గాంధీ
author img

By

Published : May 1, 2021, 9:19 PM IST

దేశంలో కరోనా విజృంభణ నేపథ్యంలో మరోసారి మోదీ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. కరోనా కేసులు తగ్గినప్పుడు తన ఘనతగా చెప్పుకుని.. ఇప్పుడు ఉద్ధృతి పెరిగితే నెపం రాష్ట్రాలపై వేస్తున్నారని ప్రధాని మోదీపై మండిపడ్డారు. కరోనా వ్యాప్తికి కారణమయ్యే కార్యక్రమాలను మోదీ, అమిత్‌ షా ప్రోత్సహించారని ఆరోపించారు. పీటీఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దేశంలో నెలకొన్న పరిస్థితులపై రాహుల్ మాట్లాడారు. దేశంలో కొవిడ్​ వ్యాప్తి చూసి ప్రపంచమే వణుకుతోందన్నారు.

" దేశంలో కరోనా కేసులు పెరుగుతుంటే మోదీ ప్రభుత్వం పట్టించుకోలేదు. వారి దృష్టి అంతా ఎన్నికల ప్రచారంపైనే పెట్టారు. వైరస్ వ్యాప్తికి కారణమయ్యే కార్యక్రమాలను ప్రోత్సహించారు. ప్రధాని మోదీ, అమిత్ షా మాస్కు ధరించటమే మర్చిపోయారు. ఇలాంటి చర్యలతో పౌరులకు ఎలాంటి సందేశం ఇస్తున్నారు? మొదటి నుంచి కరోనాను అంచనా వేయటంలో ప్రభుత్వం ఘోరంగా విఫలం అయింది."

-- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత

ప్రస్తుత సంక్షోభ సమయంలో కేంద్రానికి మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని, కానీ తమ సూచనలు, సలహాలు తీసుకునేందుకు మోదీ ప్రభుత్వం సుముఖంగా లేదన్నారు రాహుల్.

ఇదీ చదవండి : 'కరోనాపై నిమ్మకు నీరెత్తినట్లుగా కేంద్రం'

వ్యాక్సిన్​లు ఏవి?

దేశంలో తీవ్రమైన వ్యాక్సిన్​ కొరత ఉందన్నారు రాహుల్ గాంధీ. టీకాలు మన దేశంలోనే ఉత్పత్తి అవుతున్నాయని.. మరి మనకే మొదటగా అందించాల్సిన ప్రభుత్వం.. ప్రణాళిక వేయటంలో విఫలం అయిందన్నారు రాహుల్. కరోనా అంతానికి పరిష్కారం వ్యాక్సిన్​ తీసుకోవటమే అని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి : కొవిడ్ బాధితుల కోసం కాంగ్రెస్ 'హెల్ప్​లైన్'

బాధ్యతను విస్మరించాయి..

మీడియా, ఈసీ, అధికార యంత్రాంగం తమ బాధ్యతను విస్మరించాయని.. అందుకే మార్గసూచీ లేక తుపానులో చిక్కుకున్న ఓడలా భారత్‌ పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యల్లో కరోనా ఓ భాగమని.. ఇలాంటి సంక్షోభాలు వస్తే భారత్ తట్టుకునే పరిస్థితి లేదన్నారు. గత ఆరేళ్లుగా ప్రభుత్వ సంస్థలు పూర్తిగా విఫలమయ్యాయన్నారు.

ఇదీ చదవండి : బంగాల్​ దంగల్​లో విజేత ఎవరు?

పార్టీ శ్రేణుల ఇష్టం..

పార్టీని ఎవరు నడిపించాలో పార్టీ శ్రేణులే నిర్ణయిస్తారని, వారు కోరుకున్నది చేసేందుకు తాను సిద్ధమని రాహుల్ అన్నారు. పార్టీ సంస్థాగత ఎన్నికలు సకాలంలో జరుగుతాయన్నారు. కానీ ప్రస్తుతం సంక్షోభాన్ని కట్టడి చేయటంపైనే తాము దృష్టి పెట్టినట్లు వివరించారు.

ఇదీ చదవండి : 'కరోనా కట్టడికి జాతీయ విధానాన్ని రూపొందించాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.