ETV Bharat / bharat

ఒక్కసారిగా కిందపడ్డ వందలాది బస్తాలు- ఏడుగురు కూలీలు మృతి!- గోదాంలో టెన్షన్​ టెన్షన్​! - warehouse accident in karnataka today

Workers Trapped In Godown Karnataka : ఆహార ధాన్యాల గోదాంలో వందలాది బస్తాల కింద పది మందికి పైగా కార్మికులు చిక్కుకుపోయారు. ఇందులో ఆరుగురు మృతదేహాలను వెలికి తీశారు అధికారులు. కర్ణాటకలోని విజపురలో జరిగిందీ ఘటన.

Workers Trapped In Godown Karnataka
Workers Trapped In Godown Karnataka
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 4, 2023, 9:21 PM IST

Updated : Dec 5, 2023, 10:50 AM IST

Workers Trapped In Godown Karnataka : కర్ణాటకలోని విజయపురలో ఆహార ధాన్యాల గోదాములో వందలాది బస్తాల కింద చిక్కుకొని ఏడుగురు మరణించినట్లు తెలుస్తోంది. సోమవారం రాత్రి ఈ ఘటన జరగగా, సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలికి చేరుకుని నాలుగు జేసీబీలతో రెస్క్యూ ఆపరేషన్​ చేపట్టారు. ఇప్పటికే ఆరుగురు మృతదేహాలను వెలికి తీశారు అధికారులు. ముగ్గురు ప్రమాద సమయంలోనే బయటపడగా, మరొకరి కోసం గాలిస్తున్నారు.

  • VIDEO | More than 10 workers are trapped under hundreds of bags in a warehouse in Vijaypura's (Karnataka) industrial area due to the bags overturning in a huge warehouse.

    (Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/Gwps6Xbu2J

    — Press Trust of India (@PTI_News) December 4, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ జరిగింది
ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌లో పనిచేస్తుండగా మొక్కజొన్న బస్తాలు ఒక్కసారిగా పడిపోవడం వల్ల ఈ ఘటన జరిగింది. అప్రమత్తమైన ముగ్గురు కార్మికులు వెంటనే సురక్షితంగా బయటకు వచ్చారు. మిగతా ఏడుగురు మాత్రం బయటకు రాలేక అందులోనే చిక్కుకుపోయారు. ఒక్కసారిగా బస్తాలు మీద పడడం వల్ల ఊపిరాడక మరణించినట్లు అధికారులు తెలిపారు. కూలీలంతా బిహార్​కు చెందినవారని తెలిపారు. మృతులను రాజేశ్​ ముఖియా (25), రామ్​బ్రీజ్​ ముఖియా(29), శంభు ముఖియా(26), లుఖో జాదవ్​(45), రామ్​ బాలక్​ (52)గా గుర్తించారు. మరొకరి వివరాలు తెలియాల్సి ఉంది. "కార్మికులు ఎన్నో ఏళ్లుగా ఇదే పరిశ్రమలో పనిచేస్తున్నారు. ఎప్పటిలాగే ఈరోజు కూడా పని ప్రారంభించారు. ఒక్కసారిగా మొక్కజొన్న బస్తాలు పడిపోవడం వల్ల చిక్కుకుపోయారు. పోలీసు ఉన్నతాధికారులు ఘటనా స్థలాన్ని సందర్శించి పరిశీలించారు. అగ్నిమాపక సిబ్బంది కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు" అని ఓ అధికారి తెలిపారు.

"సుమారు 10-12 మంది కార్మికులు గోదాంలో చిక్కుకుపోయారు. ఇప్పటికే ముగ్గురు కార్మికులను బయటకు తీసి ప్రైవేట్​ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నాం."

--టీ భూబలన్​, డీసీపీ విజయపుర

మరోవైపు ప్రమాద స్థలంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమకు పరిహారం చెల్లించేవరకు మృతదేహాలను తీసుకెళ్లేదే లేదంటూ వారి కుటుంబీకులు పట్టుబట్టారు. అంబులెన్సులకు దారి ఇవ్వకుండా అడ్డుపడ్డారు. ఆ తర్వాత ప్రమాద సమాచారం తెలుసుకున్న మంత్రి ఎమ్​బీ పాటిల్​ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. మృతదేహాలను వారి స్వస్థలాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రితో మాట్లాడి మృతుల కుటుంబాలకు తగిన పరిహారం అందించే విధంగా కృషి చేస్తానని వారికి నచ్చచెప్పారు. దీనిపై దర్యాప్తునకు ఆదేశిస్తామని, బాధ్యులు ఎంతంటివారైనా వదిలిపెట్టబోమని తెలిపారు.

Last Updated : Dec 5, 2023, 10:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.