Modi On Congress : రాబోయే తరాలను దృష్టిలో ఉంచుకునే గత తొమ్మిదేళ్లలో కేంద్రంలోని బీజేపీ విధానాలను రూపొందించిందని, కేవలం ఒక్క కుటుంబం కోసమే పని చేయలేదని ప్రధాని నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వాలు ఏసీ గదుల్లో కూర్చుని సంక్షేమ పథకాలు తీసుకొచ్చాయని.. క్షేత్ర స్థాయి వాస్తవికతను చూడలేదని అన్నారు. కానీ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం లబ్ధిదారులతో మాట్లాడుతోందన్నారు. దీని ద్వారా పథకాల ప్రయోజనం, ఫీడ్‌బ్యాక్ ప్రత్యక్షంగా తీసుకోవచ్చని చెప్పారు. సంక్షేమ పథకాలను అందుకుంటున్న లబ్ధిదారులను నిజమైన లౌకికవాదం, సామాజిక న్యాయానికి ఉదాహరణలుగా అభివర్ణించారు. వారణాసిలో శుక్రవారం జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న మోదీ.. ఈ వ్యాఖ్యలు చేశారు.
-
#WATCH | Varanasi, Uttar Pradesh: "...The schemes of previous governments were made in air-conditioned rooms, they did not follow up on the implementation...BJP government met the beneficiaries, & we started a culture of direct benefit & direct feedback...In last 9 years, we have… pic.twitter.com/vNBNCyztDW
— ANI (@ANI) July 7, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Varanasi, Uttar Pradesh: "...The schemes of previous governments were made in air-conditioned rooms, they did not follow up on the implementation...BJP government met the beneficiaries, & we started a culture of direct benefit & direct feedback...In last 9 years, we have… pic.twitter.com/vNBNCyztDW
— ANI (@ANI) July 7, 2023#WATCH | Varanasi, Uttar Pradesh: "...The schemes of previous governments were made in air-conditioned rooms, they did not follow up on the implementation...BJP government met the beneficiaries, & we started a culture of direct benefit & direct feedback...In last 9 years, we have… pic.twitter.com/vNBNCyztDW
— ANI (@ANI) July 7, 2023
Gita Press Centenary Celebrations : అంతకుముందు.. గోరఖ్‌పుర్‌లోని గీతా ప్రెస్ శతాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో మోదీ ప్రసంగించారు. గీతా ప్రెస్ కేవలం పుస్తకాలు ముద్రించే ముద్రణాలయం మాత్రమే కాదని, కోట్ల మంది విశ్వాసం, దేవాలయని ఆయన అన్నారు. 'గీతా ప్రెస్ చేసిన కృషికి గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం గాంధీ శాంతి బహుమతిని ప్రకటించింది. గీతా ప్రెస్‌తో గాంధీజీకి ప్రత్యేక అనుబంధం ఉంది. కల్యాణ పత్రిక ద్వారా గీతా ప్రెస్ కోసం ఆయన ఎన్నో రచనలు చేశారు. గీతా ప్రెస్ భారత దేశాన్ని ఏకం చేయడంతోపాటు, దేశ ఐకమత్యానికి బలాన్ని చేకూరుస్తుంది' అని ప్రధాని మోదీ అన్నారు.
-
#WATCH | Gorakhpur, UP: PM Narendra Modi attends the closing ceremony of centenary celebrations of Gita Press pic.twitter.com/15rrH4FbvK
— ANI (@ANI) July 7, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Gorakhpur, UP: PM Narendra Modi attends the closing ceremony of centenary celebrations of Gita Press pic.twitter.com/15rrH4FbvK
— ANI (@ANI) July 7, 2023#WATCH | Gorakhpur, UP: PM Narendra Modi attends the closing ceremony of centenary celebrations of Gita Press pic.twitter.com/15rrH4FbvK
— ANI (@ANI) July 7, 2023
'15 భాషల్లో 1,600 పైగా ప్రచురణలు చేసింది. 1923లో గీతా ప్రెస్ ఆధ్యాత్మిక వెలుగులను ప్రారంభించింది. ప్రస్తుతం అది మానవత్వానికి దిక్సూచిగా మారింది. వందల ఏళ్ల క్రితం వలసవాద శక్తులు భారత దేశాన్ని దోపిడీ చేసి, మన గురుకులాలను ధ్వంసం చేశాయి. అలాంటి సమయంలో గీతా ప్రెస్ మార్గదర్శిగా నిలిచి దేశవ్యాప్తంగా ఎంతో మందికి చేరువైంది. అలాంటి సంస్థ శతాబ్ధి ఉత్సవాలన వీక్షించడం మనందరి అదృష్టం' అని మోదీ తెలిపారు.
ఇటీవలే కేంద్ర ప్రభుత్వం గీతాప్రెస్ ప్రచురణ సంస్థకు గాంధీ శాంతి పురస్కారాన్ని అందజేసింది. అహింస, గాంధేయ పద్ధతుల్లో సామాజిక, ఆర్థిక, రాజకీయ పరివర్తన కోసం అందించిన విశేష కృషికి గుర్తింపుగా ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్టు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. అయితే, అవార్డు కింద ఇచ్చే రూ. కోటి నగదును గీతా ప్రెస్ తిరస్కరించింది. ఆ మొత్తాన్ని వేరే చోట ఖర్చు చేయాలని కేంద్రాన్ని కోరింది. అయితే, ఈ పురస్కారానికి గీతా ప్రెస్‌ను ఎంపిక చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుబట్టింది.
Vande Bharat Express Gorakhpur To Lucknow : గీతా శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనడానికన్నా ముందు.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పుర్ - లఖ్‌నవూ, జోధ్‌పుర్- అహ్మదాబాద్‌ల మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లను మోదీ ప్రారంభించారు. రూ.498 కోట్ల వ్యయంతో చేపట్టనున్న.. గోరఖ్‌పుర్ రైల్వేస్టేషన్ ఆధునీకరణ పనులకు కూడా భూమిపూజ చేశారు.
-
PM Shri @narendramodi flags off two Vande Bharat trains from Gorakhpur Railway station. https://t.co/zBhguM4j3g
— BJP (@BJP4India) July 7, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">PM Shri @narendramodi flags off two Vande Bharat trains from Gorakhpur Railway station. https://t.co/zBhguM4j3g
— BJP (@BJP4India) July 7, 2023PM Shri @narendramodi flags off two Vande Bharat trains from Gorakhpur Railway station. https://t.co/zBhguM4j3g
— BJP (@BJP4India) July 7, 2023
గోరఖ్‌పుర్-లఖ్‌నవూ వందేభారత్ రైలు అయోధ్య మీదుగా వెళ్లనుంది. రైల్వే కనెక్టివిటీని మెరుగుపర్చటంసహా.. ఉత్తర్‌ప్రదేశ్ పర్యాటకానికి ఊతమిస్తుందని అధికారులు తెలిపారు. గోరఖ్‌పూర్‌లో ప్రధాని మోదీ రోడ్‌షోలో ఆసక్తికర సంఘటన జరిగింది. భారీ వర్షం పడుతున్నప్పటికీ ప్రజలు రోడ్డుకు ఇరువైపులా నిల్చుని ఆయనకు స్వాగతం పలికారు.
-
#WATCH | People gather to greet PM Narendra Modi despite heavy rain during his roadshow in Gorakhpur, Uttar Pradesh, earlier today. pic.twitter.com/AgRWxNKMfS
— ANI (@ANI) July 7, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | People gather to greet PM Narendra Modi despite heavy rain during his roadshow in Gorakhpur, Uttar Pradesh, earlier today. pic.twitter.com/AgRWxNKMfS
— ANI (@ANI) July 7, 2023#WATCH | People gather to greet PM Narendra Modi despite heavy rain during his roadshow in Gorakhpur, Uttar Pradesh, earlier today. pic.twitter.com/AgRWxNKMfS
— ANI (@ANI) July 7, 2023