ఉత్తర్‌ప్రదేశ్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తోన్న ఓ మహిళ నామపత్రాలు తిరస్కరణకు గురయ్యాయి. పుర్కాజీ బ్లాక్ పరిధిలో సర్పంచి అభ్యర్థిగా పోటీలో నిలిచిన సోనియా అనే ఆ అభ్యర్థి పత్రాలపై ప్రతీచోటా ఆమె రెండో భర్త సతేంద్ర పేరు ఉంది. అయితే ఓటర్ లిస్ట్‌లో మాత్రం ఆమె మొదటి భర్త దేవేందర్ పేరు ఒక్కటే ఉంది. ఇదే కారణంతో నామినేషన్‌ను తిరస్కరించినట్లు రిటర్నింగ్ అధికారి ఆర్.కె శ్రీవాస్తవ తెలిపారు.
ఆ మహిళ మొదట దేవేందర్‌ను పెళ్లాడింది. ఆయన ఇంట్లో నుంచి వెళ్లిపోయాక.. దేవేందర్ సోదరుడు సత్యేందర్‌ను పెళ్లి చేసుకుంది.
ఇదీ చదవండి: రూ.3 కోట్ల బీమా కోసం.. కారులోనే భర్తను కడతేర్చి