ETV Bharat / bharat

మహిళపై ఆరు నెలలుగా గ్యాంగ్​ రేప్​.. లవర్​ అరెస్ట్​! - మహిళపై గ్యాంగ్​ రేప్​

Gang rape victim: ప్రేమ పేరుతో మోసగించి గర్భవతిని చేసి వదిలేశాడో ప్రబుద్ధుడు. కుటుంబ సభ్యులు ఇంట్లోంచి వెళ్లగొట్టగా స్థానిక పాఠశాలలో తలదాచుకుంటే మరికొంత మంది అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన బిహార్​లోని పశ్చిమ చంపారన్​ జిల్లాలో జరిగింది. రాజస్థాన్​లో జరిగిన మరో ఘటనలో.. మసాజ్​ పేరుతో విదేశీ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి.

author img

By

Published : Mar 18, 2022, 4:12 PM IST

Gang rape victim: ఓ మహిళను ప్రేమ పేరుతో ట్రాప్​ చేసి ఆరు నెలలుగా లవర్​ సహా పలువురు అత్యాచారానికి పాల్పడిన సంఘటన బిహార్​లోని పశ్చిమ చంపారన్​ జిల్లాలో జరిగింది. ఈ కేసులో బాధితురాలి ప్రేమికుడిని అరెస్ట్​ చేశారు పోలీసులు. మిగతా వారికోసం గాలిస్తున్నారు.

ఇదీ జరిగింది..

పోలీసుల కథనం ప్రకారం.. ఆరు నెలల క్రితం బాధితురాలిని లవ్​ ట్రాప్​లోకి దింపాడు నిందితుడు. ఇద్దరు శారీరకంగా కలిసిన తర్వాత వదిలేశాడు. బాధితురాలు గర్భం దాల్చగా పెళ్లికి నిరాకరించి.. అబార్షన్​ చేయించాడు. దీంతో ఆమె కుటుంబం సైతం ఇంట్లోంచి వెళ్లగొట్టింది. అప్పటి నుంచి స్థానిక పాఠశాలలో తలదాచుకుంటోంది. పాఠశాలలో ఒంటరిగా ఉంటున్న బాధితురాలిపై కొందరు దుండగులు కన్నేశారు. మార్చి 5న ఆమెపై ఇద్దరు వ్యక్తులు గ్యాంగ్​ రేప్​కు పాల్పడ్డారు. ఆ తర్వాత మార్చి 11న గ్రామానికి చెందిన మరో వ్యక్తి అత్యాచారం చేశాడు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని బెదిరించారు.

తనపై జరిగిన అఘాయిత్యాలపై స్థానిక మహిళా పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది బాధితురాలు. కేసు నమోదు చేసుకుని ఆమె ప్రేమికుడిని అరెస్ట్​ చేశారు. 'బాధితురాలిని వైద్య పరీక్షలకు పంపించాం. పరారీలో ఉన్నవారి కోసం గాలింపు చేపట్టాం. అరెస్టయిన నిందితుడు పలుమార్లు మహిళను కలిశాడు. ఈ క్రమంలోనే ఆమె తల్లిదండ్రులను చంపేస్తానని బెదిరించాడు' అని బగగా ఎస్​డీపీఓ కైలాశ్​ ప్రసాద్​ తెలిపారు.

మసాజ్​ పేరుతో విదేశీయురాలిపై రేప్​

ఆయుర్వేద మసాజ్​ పేరుతో ఓ విదేశీయురాలిపై అత్యాచారానికి పాల్పడిన సంఘటన రాజస్థాన్​ రాజధాని జైపుర్​లో జరిగింది. సింధీ క్యాంప్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని ఓ హోటల్​లో ఈ అఘాయిత్యం జరిగింది. నెదర్లాండ్స్​కు చెందిన బాధితురాలు(30) ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అరెస్ట్​ చేశారు పోలీసులు.

"కొన్ని రోజుల క్రితం జైపుర్​ను చూసేందుకు బాధితురాలు నెదర్లాండ్స్​ నుంచి వచ్చింది. స్థానిక హోటల్​లో ఉంటోంది. ఈ క్రమంలోనే మార్చి 16న ఆయుర్వేద మసాజ్​ అంటూ ఓ వ్యక్తి ఆమె గదికి వెళ్లాడు. అర్ధగంట పాటు మసాజ్​ చేసిన తర్వాత ఆమెతో అసభ్యంగా ప్రవర్తించటం ప్రారంభించాడు. ఆ తర్వాత అత్యాచారానికి పాల్పడ్డాడు. చివరికి ఆమెకు క్షమాపణలు చెప్పి ఎవరికీ చెప్పొద్దని వేడుకున్నాడు. ఓ గంట తర్వాత హోటల్​ నుంచి వెళ్లిపోయాడు. రోజంతా మనోవేదనకు గురైన బాధితురాలు గురువారం రాత్రి హోటల్​ మేనేజర్​కు జరిగిన విషయాన్ని చెప్పింది. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు కేరళకు చెందిన మురళీధర్​ అలియాస్​ బిజును కస్టడీలోకి తీసుకున్నారు. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించారు."

- గుంజన్​ సోనీ, సింధి క్యాంప్​ పోలీస్​ స్టేషన్​ అధికారి.

ఈ సంఘటన జరిగిన తర్వాత నిందితుడు నగరాన్ని వదిలి కేరళకు పారిపోయేందుకు సిద్ధమైనట్లు పోలీసు అధికారి తెలిపారు. ఖాతీపురా ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించి అరెస్ట్​ చేశామన్నారు. ఖాతీపురాలో మసాజ్​ సెంటర్​ నడిపిస్తున్నాడని, ప్రముఖ హోటళ్లతో కాంట్రాక్టులు కుదుర్చుకుని మసాజ్​ సేవలు అందిస్తున్నట్లు గుర్తించామన్నారు.

ఇదీ చూడండి: చెరువు మధ్యలో దాక్కున్న 'రౌడీ'.. డ్రోన్ సాయంతో పట్టేసిన పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.