ఒడిశాకు చెందిన ఓ మహిళ తన భర్త మరణించిన తర్వాత అందాల్సిన పింఛను సొమ్ము కోసం 52 ఏళ్ల పాటు నిరీక్షించాల్సి వచ్చింది. 89 ఏళ్ల వయసులో ఆమెకు రూ.16 లక్షల తాత్కాలిక పెన్షన్ వచ్చింది.
ఇదీ జరిగింది..
బాలేశ్వర్ జిల్లాలోని ఆరాద్ బజార్‌కు చెందిన లలితా మొహంతి 37 సంవత్సరాల వయస్సులో తన భర్త భీమ్‌సేన్‌ను కోల్పోయారు. ఒడిశా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో భీమ్‌సేన్ పనిచేస్తూ కన్నుమూశారు. ఆయన మరణానంతరం.. లలితకు ఓఎస్ఆర్టీసీ నుంచి ఎటువంటి పెన్షన్ రాలేదు. అందుకు లలిత సుదీర్ఘ న్యాయపోరాటం చేశారు. ఎట్టకేలకు ఆమెకు న్యాయం జరిగింది. తొమ్మిదేళ్ల క్రితం కోర్టు ఇచ్చిన ఆదేశాలనుసారం.. లలితకు ఓఎస్ఆర్టీసీ రూ.16 లక్షలు చెల్లించింది.

ఇవీ చదవండి: 'రూ.25 కోట్లు గెలిచాక మనశ్శాంతి లేదు.. అందరు అప్పులు అడుగుతున్నారు'
కి'లేడీ' వివాహాలు.. ఆరుగురిని మనువాడిన మహిళ.. ఏడోసారి పెళ్లి పీటలు ఎక్కుతూ..