woman birth to five children: రాజస్థాన్ కరౌలీ జిల్లాకు చెందిన ఓ మహిళ సోమవారం ఒకే కాన్పులో ఐదుగురు శిశువులకు జన్మనిచ్చింది. అయితే ఆ దంపతులకు ఈ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. పుట్టిన శిశువుల్లో ముగ్గురు వెంటనే ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వీరిని మెరుగైన వసతులు ఉన్న జైపుర్లోని ఓ ఆస్పత్రికి తరలించారు.
వివరాల్లోకి వెళితే...
స్థానికంగా నివాసం ఉండే అష్రఫ్ అలీ భార్య రేష్మ పురుటి నొప్పులతో భరత్ ఆస్పత్రిలో చేరింది. వైద్యురాలు భరత్లాల్ మీనా ఆమెకు వైద్యం చేశారు. సాధారణ ప్రసవం ద్వారానే మహిళ ఐదుగురికి జన్మనిచ్చినట్లు డాక్టర్ వెల్లడించారు. ఇద్దరు మగపిల్లలు కాగా, ముగ్గురు బాలికలు జన్మించినట్లు చెప్పారు. ఏడేళ్ల తర్వాత మహిళకు సంతానం కలిగిందని వెల్లడించారు.
కారణం అదే?
అయితే, చిన్నారులు ఏడో నెలలోనే గర్భం నుంచి బయటకు వచ్చారని వైద్యులు తెలిపారు. నెలలు నిండకముందు జన్మించడం వల్లే శిశువులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. చిన్నారులకు మెరుగైన చికిత్స అవసరం అని భావించి.. కరౌలీలోని మరో ఆస్పత్రికి సిఫార్సు చేశారు. అక్కడ చికిత్స పొందుతుండగా వీరు చనిపోయారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
ఇదీ చదవండి: