ETV Bharat / bharat

ఆకాశవీధిలో శిశువు జననం - ఇండిగోలో పుట్టిన చిన్నారి

విమానం ఆకాశంలో ఉండగా పండంటి శిశువుకు జన్మనిచ్చింది ఓ మహిళ. విమానయాన సిబ్బంది సాయంతో ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రసవం జరిగిందని ఇండిగో ఎయిర్​లైన్స్​ తెలిపింది.

Woman delivers baby on board Indigo flight from Bangalore to Jaipur
ఆకాశవీధిలో శిశువు జననం
author img

By

Published : Mar 17, 2021, 12:57 PM IST

Updated : Mar 17, 2021, 1:12 PM IST

బెంగళూరు నుంచి జైపుర్​ వెళ్తున్న విమానంలో ఓ మహిళకు ప్రసవం చేశారు ఇండిగో ఎయిర్​లైన్స్​ సిబ్బంది. ఆ ఘటనలో ఆమె ఆడశిశువుకు జన్మనిచ్చిందని విమానయాన సంస్థ తెలిపింది. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నట్లు పేర్కొంది.

"ఇండిగోకు చెందిన 6ఈ469 విమానంలో మహిళ బిడ్డకు జన్మనిచ్చింది. బెంగళూరు నుంచి జైపుర్​ వెళ్లే మార్గమధ్యంలో ఈ ఘటన జరిగింది. విమానంలో ప్రయాణిస్తున్న డా. సుబానా నజీర్, ఇండిగో సిబ్బంది ప్రసవానికి సాయం చేశారు."

- ఇండిగో ఎయిర్​లైన్స్ ప్రకటన

విమానం జైపుర్​ విమానాశ్రయానికి చేరేసరికి అంబులెన్స్​ను, డాక్టర్​ను సిద్ధంగా ఉంచినట్లు సంస్థ పేర్కొంది. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నట్లు వెల్లడించింది.

ఇదీ చూడండి: కొడుకు చెంప దెబ్బ- తల్లి మృతి

Last Updated : Mar 17, 2021, 1:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.