ETV Bharat / bharat

భారత భూభాగంలో చైనా గుడారాలు ప్రత్యక్షం!

ఓ వైపు భారత్​- చైనా దౌత్య, సైనిక చర్చలు కొనసాగుతున్నా.. చైనా కవ్వింపు చర్యలు మాత్రం ఆగటంలేదు. తూర్పులద్ధాఖ్​లోని దెమ్​చోక్​ వద్ద ఆ దేశ పౌరులు గుడారాలను వేసినట్లు అధికారులు తెలిపారు. అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్లిపోవాలని భారత సైన్యం హెచ్చరించిందన్నారు.

china
చైనా
author img

By

Published : Jul 26, 2021, 12:43 PM IST

వాస్తవాధీన రేఖ వెంట (ఎల్​ఏసీ) శాంతి పునరుద్ధరణకు ఓ పక్క కోర్‌ కమాండర్ల స్థాయి భేటీకి ఏర్పాట్లు జరుగుతున్నా.. చైనా కవ్వింపు చర్యలు మాత్రం ఆగటంలేదు. తాజాగా దెమ్‌చోక్‌లోని చార్‌డింగ్‌ నాలా వద్ద.. ఆ దేశం గుడారాలను వేసినట్లు సమాచారం.

భారత సైన్యం అక్కడి వారిని ప్రశ్నించగా.. తాము చైనా పౌరులమని చెప్పినట్లు తేలింది. దీంతో సైన్యం వారిని అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్లిపోవాలని హెచ్చరించినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే వారు అక్కడే కొనసాగుతున్నట్లు సమాచారం.

గుడారాలు ప్రత్యక్షం..

వాస్తవానికి.. ఇవాళ ఇరు దేశాల మధ్య కోర్‌ కమాండర్‌ స్థాయి సమావేశం జరగాల్సి ఉంది. కార్గిల్‌ యుద్ధ విజయ దినోత్సవ కార్యక్రమాల వల్ల భారత్‌ ఈ సమావేశాన్ని వాయిదా వేసింది. అదేసమయంలో ఈ గుడారాలు ప్రత్యక్షం కావడం గమనార్హం. 1990ల్లో ఏర్పాటు చేసిన ఇండో చైనా జాయింట్‌ వర్కింగ్‌ గ్రూప్‌ దెమ్‌చోక్‌, ట్రిగ్‌హైట్స్‌లను వివాదాస్పద ప్రాంతాలుగా గుర్తించింది.

అంత ఉద్రిక్తత లేదు..

వాస్తవాధీన రేఖ వెంట ఉద్రిక్తతలు పెరగడంతో ఇటీవలే భారత్‌ నార్తన్‌ కమాండ్‌లోని ఉగ్రవాద వ్యతిరేక దళాలను వాస్తవాధీన రేఖ వద్దకు తరలించింది. సరిహద్దులకు దళాల చేరవేతలు జరుగుతున్నా.. ఇరుపక్షాలు ముఖాముఖీ తలపడేంత ఉద్రిక్తత లేదని అధికారులు చెబుతున్నారు. దౌలత్‌ బేగ్‌ ఓల్డీ, చుషూల్‌ వద్ద ఏర్పాటు చేసిన హాట్‌లైన్ల ద్వారా.. చైనా దళాలతో వివిధ అంశాలపై సంప్రదింపులు, సమన్వయం జరుగుతోందని భారత అధికారులు తెలిపారు.

ఇప్పటి వరకు 1500 సార్లు హాట్‌ మార్గంలో సందేశాలు ఇచ్చిపుచ్చుకొన్నట్లు చెబుతున్నారు. ఎల్​ఏసీలో పరిస్థితులకు సంబంధించి.. భారత్‌ పూర్తిగా 2019 నాటి వాతావరణం నెలకొల్పాలని కోరుతుండగా.. చైనా మాత్రం దళాలను శాంతి సమయాల్లో మోహరించే చోట్ల ఉంచితే చాలని అంటోంది.

ఇవీ చదవండి: మళ్లీ రాజుకొంటున్న తూర్పు లద్దాఖ్‌!

బలగాల ఉపసంహరణ: చైనా ఉచ్చులో భారత్?

'ఆ విషయంలో చైనాపై ఓ కన్నేసి ఉంచాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.