ETV Bharat / bharat

పేదల కోసం పని చేస్తా... చెడు మార్గంలో వెళ్లను..! - ఆర్యన్​ ఖాన్​ న్యూస్​

బాలీవుడ్ నటుడు షారుఖ్​ ఖాన్​ కుమారుడు (Shahrukh Khan Son News Today) ఆర్యన్​ ఖాన్​కు పోలీసులు శనివారం కౌన్సిలింగ్ ఇచ్చారు. దీనిని ముంబయిలోని ఓ జైలులో నిర్వహించారు. ఈ క్రమంలో మాట్లాడిన ఆర్యన్..​ పేదల సంక్షేమం కోసం పని చేస్తానని చెప్పినట్లు అధికారులు తెలిపారు.

aryan khan counseling
ఆర్యన్​ ఖాన్​ కౌన్సిలింగ్​
author img

By

Published : Oct 17, 2021, 7:01 AM IST

విడుదల అయిన తర్వాత పేదల సంక్షేమానికి కృషి చేస్తానని.. తనకు చెడ్డపేరు తెచ్చే పనులు చేయబోనని, చెడు మార్గంలో వెళ్లనని బాలీవుడ్​ నటుడు షారుఖ్​ ఖాన్​ కుమారుడు (Shahrukh Khan Son News Today) ఆర్యన్​ ఖాన్​ శనివారం ఎన్​సీబీ అధికారులకు హామీ ఇచ్చాడు. ఈ నెల 2న ఓ క్రూయిజ్​ నౌకలో మాదకద్రవ్యాలను (Drug Case News) స్వాధీనం చేసుకున్న కేసులో ఆర్యన్​ను ఎన్​సీబీ అరెస్ట్​ చేసింది. ఈ మేరకు ముంబయిలోని ఓ జైలులో అధికారులు కౌన్సిలింగ్​ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్యన్​ వివిధ అంశాలపై మాట్లాడినట్లు అధికారులు తెలిపారు.

'పేదలు, అణగారిన వర్గాల ప్రజలకు చేయూతనిస్తా.. నన్ను చూసి గర్వపడేలా చేస్తా' అని అధికారులకు చెప్పాడు. కాగా అతని బెయిల్​ వ్యాజ్యంపై ప్రత్యేక కోర్ట్​ ఈ నెల 20న ఆదేశాలు ఇవ్వనుంది.

ఇదీ చూడండి: కేరళలోని ఆరు జిల్లాల్లో రెడ్​ అలెర్ట్​.. రంగంలోకి ఎన్​డీఆర్​ఎఫ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.