ETV Bharat / bharat

భర్తను చెప్పుతో కొట్టింది.. కాపురాన్ని చేతులారా..!

author img

By

Published : Apr 29, 2022, 11:35 AM IST

Wife's Slap To Husband: క్షణికావేశంలో చేసిన పని ఆమె వివాహ బంధాన్ని నాశనం చేసింది. కోపంతో భర్తను చెప్పుతో కొట్టంది ఓ భార్య. అవమానంగా భావించిన భర్త విడాకులు కోరాడు. తర్వాత భార్య తన తప్పును అంగీకరించినా.. ఫలితం లేకుండా పోయింది.

Wife's slap to husband
Wife's slap to husband

Wife's Slap To Husband: దంపతుల మధ్య తలెత్తిన చిన్న వివాదం విడాకులకు దారితీసింది. క్షణికావేశంలో చేసిన పని.. ఆమె వివాహ బంధాన్ని నాశనం చేసింది. మధ్యప్రదేశ్​ భోపాల్​కు చెందిన దంపతులు.. 12 ఏళ్లుగా విదేశాల్లో నివసిస్తున్నారు. అయితే కరోనా మహమ్మారితో తలెత్తిన పరిస్థితుల దృష్ట్యా భారత్​కు రావాలని నిశ్చయించుకున్నారు. దీంతో భోపాల్​కు తిరిగి వచ్చి భర్త.. ఓ వ్యాపారాన్ని ప్రారంభించగా.. భార్య ఓ కళాశాలలో లెక్చరర్​గా ఉద్యోగం చేస్తుంది. వీరికి ఇద్దరు పిల్లలు కాగా, వారు విదేశాల్లోనే చదువుతున్నారు.

అయితే భారత్​కు వెళ్లాలని భర్త తీసుకున్న నిర్ణయం భార్యకు నచ్చలేదు. దీంతో వీరిద్దరి మధ్య తరచూ.. గొడవలు జరిగేవి. ఈ క్రమంలో కోపంతో ఉన్న భార్య.. భర్తను చెప్పుతో కొట్టింది. దీంతో ఆగ్రహించిన భర్త విడాకులకు దరఖాస్తు చేశాడు. అయితే కౌన్సిలింగ్​ సమయంలో భార్య తన తప్పును ఒప్పుకుంది. కానీ భర్త మాత్రం ఈ అవమానాన్ని తాను జీవితాంతం భరించలేనని.. ఆమెతో జీవించలేనని చెప్పాడు. భర్తను ఒప్పించేందుకు భార్య తీవ్రంగా ప్రయత్నించినా.. అతడు అంగీకరించలేదు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం విడాకులు మంజూరు చేసింది.

ఇదీ చదవండి: లైవ్ వీడియో.. మాజీ భార్య, కూతురిని కాల్చి చంపిన వ్యక్తి.. ఆపై తానూ..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.