woman killed husband using electric shocks : ప్రియుడితో పరార్ అయ్యేందుకు భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన ఓ మహిళ దారుణానికి తెగబడింది. కట్టుకున్నవాడిని హత్య చేసి, ప్రియుడితో వెళ్లిపోయింది. ఏప్రిల్ 9న ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మరణించినట్లు పోలీసులకు సమాచారం రాగా... దర్యాప్తు చేపట్టిన పోలీసులు మృతుడి భార్యతో పాటు ఆమె ప్రియుడ్ని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని రిమాండ్‌కు తరలించారు. మృతుడి ఫోన్‌లోని కొన్ని ఆడియో క్లిప్‌ల ఆధారంగా హత్య విషయం బయటపడింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మథురలోని బల్దేవ్ పరిధిలో జరిగింది.
వివరాల్లోకి వెళ్తే... బల్దేవ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సేల్ ఖేఢాగ్రామంలో నివసిస్తున్న సుబేదార్ సింగ్ అనే వ్యక్తి మార్చి 26న తన చిన్న కుమారుడు మాన్వేంద్రకు వివాహం జరిపించాడు. పెళ్లయిన కొద్దిరోజుల తర్వాత మాన్వేంద్ర భార్య తన తల్లి తరపు బంధువులతో మాట్లాడాలన్న నెపంతో తరచూ భర్త ఫోన్‌ను ఉపయోగించేది. ఏప్రిల్‌లో అదే గ్రామ శివార్లో సుబేదార్కు సంబంధించిన మరో ఇంట్లో మాన్వేంద్ర దంపతులు నిద్రించారు. సుమారు ఒంటిగంట ప్రాంతంలో మాన్వేంద్ర భార్య సుబేదార్ సింగ్ ఉంటున్న పాత ఇంటికి వచ్చి తన భర్త విద్యుదాఘాతానికి గురయ్యాడని తెలిపింది. విషయం విన్న సుబేదార్ వెంటనే కొత్త ఇంటికి చేరుకున్నాడు.
విద్యుత్ తీగ తగిలి కుడి కాలుపై కాలిన గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్న తన కుమారుడిని చూసిన ఆయన హుటాహుటిన అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అప్పటికే మాన్వేంద్ర మృతిచెందినట్లు వైద్యులు నిర్ధరించారు.ఈ విషయాన్ని అందరు ప్రమాదంగా భావించడం వల్ల అసలు విషయం బయటకు రాలేదు. మాన్వేంద్ర మరణించిన తర్వాత, అతని ఫోన్‌కు నిరంతరం కాల్స్ వస్తునే ఉండేది, ఇది గమనించిన మృతుడి తండ్రి సుబేదార్..కుమారుడి ఫోన్‌ను ఓ బాక్స్‌లో భద్రపరిచాడు. ఘటన జరిగిన 15 రోజుల తర్వాత మాన్వేంద్ర భార్య తన పుట్టింటికి వెళ్లింది. సెప్టెంబర్ 3న, సుబేదార్ సింగ్ మనవడు, పెట్టెలోని ఫోన్‌ను బయటకు తీశాడు.
మొబైల్ చెక్ చేస్తుండగా ఒక్కసారిగా అనుమానాస్పద కాల్ రికార్డింగ్‌లు వినిపించాయి. అందులో మాన్వేంద్ర భార్య మరో వ్యక్తితో 'నీ సూచనల మేరకు 10 నిమిషాలు కరెంట్ షాక్ ఇచ్చాను' అని చెప్తున్న రికార్డింగ్ ఒకటి బయటపడింది. దానితో పాటు ఆమె సంభాషణలు అన్నీ ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి. ఆ రికార్డింగ్స్ విన్న మాన్వేంద్ర కుటుంబసభ్యులు షాక్‌కు గురయ్యారు. వెంటనే ఫోన్ తీసుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు.
పోలీసులు ఆడియో ఆధారంగా నిందితుడిని గుర్తించారు. కాల్లో మాన్వేంద్ర భార్య మాట్లాడుతున్నది ఆమె ప్రేమికుడు అతేంద్రతోనే అన్న విషయం వెలుగులోకి వచ్చింది. తల్లి ఇంటికి వెళ్లిన 15 రోజుల తర్వాత మన్వేంద్ర భార్య అతేంద్రతో పరారయ్యింది. పోలీసుల గాలింపులో నిందితులిద్దరు పట్టుబడ్డారు. విచారణలో మరో విషయం తెలిసింది. అదేందంటే.. మాన్వేంద్ర భార్య మొదట అతనికి మత్తు మందు తినిపించి ఆ తర్వాత అపస్మారక స్థితిలో ఉన్న మున్వేందర్కు విద్యుత్ షాక్ ఇచ్చి హత్య చేసిందని ఆమె పోలీసుల విచారణలో తెలిపింది.
ఇదీ చదవండి: కూతురిపై 32 ఏళ్లుగా రేప్!.. 11 ఏళ్ల వయసులోనే దారుణం.. వివాహమైనా వదలకుండా..
'సైరాట్' నటుడిపై చీటింగ్ కేసు.. సచివాలయంలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసం!