సోషల్మీడియా వచ్చాక చాలా మందికి చాటింగే ప్రపంచమైపోయింది. అవతల వ్యక్తితో గంటల తరబడి చాటింగ్ చేస్తూ కాలం గడుపుతారు. ఇది క్రమంగా కొందరికి వ్యసనంగా మారింది. ఎంత అంటే.. అడ్డు చెప్పిన వారి పళ్లు రాలగొట్టేంత! ఓ మహిళ తన భర్త అడిగిన ప్రశ్నకు ఇలానే బదులిచ్చింది మరి. ఆశ్చర్యం కలిగిస్తున్న ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లా జిల్లా థియోగ్లో జరిగింది.
థియోగ్ సమీపంలోని చైలా చౌకీ ప్రాంతంలో నివసిస్తున్న అమిత్ కుమార్.. ఎప్పటిలాగే ఆఫీసు పని పూర్తయ్యాక ఇంటికి వచ్చాడు. ఇంట్లో భార్య చాటింగ్లో బిజీగా ఉండటం చూసి ఎవరితో చాట్ చేస్తున్నావ్ అని అడిగాడు. అంతే.. చాటింగ్ మధ్యలో అడ్డువచ్చినందుకు భర్తపై ఆగ్రహం చెందిన ఆమె, అతనిపై దాడికి దిగింది. అక్కడే ఉన్న ఓ కర్రతో చితకబాదింది. ఈ క్రమంలో అతని మూడు పళ్లు రాలిపోయాయి.
దీనిపై అమిత్ పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
ఇదీ చూడండి : Monkey Revenge: కోతి 'పగ'- ఆటోడ్రైవర్ గుండెల్లో దడ!