ETV Bharat / bharat

కేరళ ఎన్నికలు: ఆ ఒక్కటీ.. ఆగేనా? కూలేనా?

కేరళలోని నెమోమ్‌ అసెంబ్లీ సీటు ప్రస్తుతం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. రాష్ట్రంలో తమ ఏకైక సిట్టింగ్‌ స్థానమైన ఆ నియోజకవర్గాన్ని తిరిగి దక్కించుకునేందుకు భాజపా పక్కా ప్రణాళికలు రచిస్తుండగా.. ఉన్న ఆ ఒక్క సీటునూ కమలనాథుల నుంచి లాక్కొని కేరళను 'భాజపారహిత రాష్ట్రం'గా మార్చాలని కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌, సీపీఎం నాయకత్వంలోని ఎల్‌డీఎఫ్‌ గట్టి పట్టుదలతో ఉన్నాయి. దీంతో ఇక్కడ పోరు అత్యంత రసవత్తరంగా సాగుతోంది.

Why Nemom will see a strong three-way race unlike other Kerala constituencies
ఆ ఒక్కటీ.. ఆగేనా? కూలేనా?
author img

By

Published : Mar 21, 2021, 9:46 AM IST

తిరువనంతపురం జిల్లాలో నెమోమ్‌ సీటు ఉంది. ఇక్కడ ఓటర్ల సంఖ్య దాదాపు రెండు లక్షలు. అందులో అగ్రవర్ణ హిందువులే మెజారిటీ వర్గంగా ఉన్నారు. జనాదరణ ఎక్కువగా ఉన్న 86 ఏళ్ల రాజగోపాల్‌ను భాజపా 2016 ఎన్నికల్లో ఇక్కడ బరిలో దించింది. ఎల్‌డీఎఫ్‌, యూడీఎఫ్‌ల ఆధిపత్యానికి సవాలు విసురుతూ.. ఆయన విజయం సాధించారు. నాటి నుంచీ నియోజకవర్గంపై తమ పట్టును పదిలపర్చుకునేందుకు కమలనాథులు తీవ్రంగా శ్రమించారు. గుజరాత్‌ అభివృద్ధి నమూనాను విస్తృతంగా ప్రచారం చేశారు. తమ ఓటు బ్యాంకు నిలకడగా పెరిగిందని.. నెమోమ్‌లో ఇక తమను ఓడించడం అసాధ్యమని వారు చెబుతున్నారు. 'కేరళలోని గుజరాత్‌'గా ఆ స్థానాన్ని అభివర్ణిస్తున్నారు. ఇక్కడ మరోసారి విజయం సాధించి.. రాష్ట్రం నలుమూలలా పార్టీ పట్టును విస్తరింపజేయాలని వారు కృతనిశ్చయంతో ఉన్నారు.

raja gopal
రాజగోపాల్

మోదీ-షా వచ్చే అవకాశం

నెమోమ్‌లో భాజపా మళ్లీ గెలిస్తే.. కేరళ రాజకీయాల్లో కీలక మలుపుగా అది నిలవడం ఖాయం! రాష్ట్రంలో కమలదళం విస్తరణకు ఆ విజయం బాటలు పరిచే అవకాశముంది. అందుకే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాలను రప్పించి నెమోమ్‌లో ప్రచారం నిర్వహించాలని రాష్ట్ర భాజపా నేతలు ప్రణాళికలు రచిస్తున్నారు. "నెమోమ్‌ మా కంచుకోట. రాహుల్‌ గాంధీ అయినాసరే ఇక్కడ మాపై గెలవలేరు" అని కేరళ భాజపా అధ్యక్షుడు కె.సురేంద్రన్‌ చెబుతుండటం గమనార్హం.

Nemom constituency
2019 సార్వత్రిక ఎన్నికల్లో

త్రిముఖ పోటీ

ప్రస్తుతం నెమోమ్‌లో త్రిముఖ పోటీ నెలకొంది. ఇక్కడ మూడు పార్టీలూ బలమైన అభ్యర్థులను బరిలో దించాయి. భాజపా తరఫున కుమ్మనమ్‌ రాజశేఖరన్‌ పోటీ చేస్తున్నారు. ఆయన మిజోరాం మాజీ గవర్నర్‌. సీపీఎం నుంచి వి.శివన్‌కుట్టి మరోసారి రంగంలోకి దిగారు. 2011 ఎన్నికల్లో ఇక్కడ విజయం సాధించిన ఆయన.. 2016లో పరాజయం పాలయ్యారు. కాంగ్రెస్‌ నుంచి మాజీ ముఖ్యమంత్రి కె.కరుణాకరన్‌ కుమారుడు కె.మురళీధరన్‌ బరిలో నిలిచారు. ఆయన ప్రస్తుతం వటకర ఎంపీగా కూడా ఉన్నారు. ఓ దశలో మాజీ సీఎం ఊమెన్‌ చాందీని ఇక్కడ బరిలో దించే అవకాశాలనూ హస్తం పార్టీ పరిశీలించిందంటే.. అక్కడ పోటీ ఎంత ప్రతిష్ఠాత్మకంగా మారిందో అర్థం చేసుకోవచ్చు.

Nemom constituency
2016లో

ఇదీ చదవండి:ఆ రాష్ట్రంలో ఎన్నికలున్నా ఫ్లెక్సీలు లేవు.. ఎందుకంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.