ETV Bharat / bharat

గులాం​ నబీ ఆజాద్ స్థానంలో నెక్ట్స్​ ఎవరు?

author img

By

Published : Feb 11, 2021, 4:13 PM IST

Updated : Feb 12, 2021, 11:45 AM IST

కాంగ్రెస్​ నేత గులాం​ నబీ ఆజాద్​ ఈనెల 15న పదవీ విరమణ పొందనున్నారు. ఈ సందర్భంగా ఆయన స్థానంలో ఎవరికి అవకాశం ఇవ్వాలనే అంశంపై కాంగ్రెస్​.. పలువురు సీనియర్​ నేతల పేర్లను పరిశీలిస్తోంది. దళిత నేత మల్లికార్జున ఖర్గేకు అవకాశాలు ఎక్కువ ఉన్నట్లు సమాచారం.

congress, leader of opposition, rajya sabha
గులామ్​ నబీ ఆజాద్ స్థానంలో ఇప్పుడెవరు?

రాజ్యసభ సభ్యుడిగా కాంగ్రెస్​ సీనియర్ నేత గులాం​ నబీ ఆజాద్​ ఈనెల 15న పదవీ విరమణ పొందనున్న నేపథ్యంలో ఆయన స్థానాన్ని కాంగ్రెస్​ ఎవరికి అప్పగిస్తుందనే విషయం ఆసక్తికరంగా మారింది. ఆజాద్ రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్షనేతగా బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు కాంగ్రెస్​ పలువురు సీనియర్​ నేతల పేర్లను పరిశీలిస్తోందని సమాచారం. ఈ జాబితాలో మల్లికార్జున​ ఖర్గే, ఆనంద్​ శర్మ, దిగ్విజయ్​ సింగ్, చిదంబరం, కపిల్​ సిబల్​ వంటి కీలక నేతలు ఉన్నారు.

లెక్కప్రకారం..

సీనియారిటీ ప్రకారం ఆ పదవి ఆజాద్​ తర్వాతి స్థానంలో ఉన్న ఆనంద్​ శర్మకు దక్కాలి. ప్రస్తుతం రాజ్యసభలో ఉప ప్రధాన ప్రతిపక్షనేతగా ఆయన కొనసాగుతున్నారు. పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా ఉన్నారు. అయితే శర్మకు పదవి దక్కడంపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. పార్టీలో సంస్కరణలు అవసరమంటూ ఇటీవల కాంగ్రెస్​ అధిష్ఠానానికి లేఖ రాసిన 23 మందిలో ఆయన ఒకరు. ఈ ప్రభావం ఆయన నియామకంపైన ఉండొచ్చని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ఆనంద్​ శర్మకు ప్రత్యామ్నాయంగా మధ్యప్రదేశ్​ మాజీ సీఎం, సీనియర్ నేత దిగ్విజయ్​ సింగ్​ను నియమించే అవకాశం ఉంది. ప్రాంతీయ సమానత్వాన్ని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్​ ఈ నిర్ణయం తీసుకునే వీలుంది. లోక్​సభలో ప్రతిపక్ష నేత అధిర్ రంజన్​ చౌదరి, గౌరవ్​ గొగొయ్​ ఇద్దరూ హిందీ రాష్ట్రాలకు చెందని వారే. సీనియారిటీ విషయానికొస్తే చిదంబరం కూడా వీరితో సమానంగా అర్హులే.

ఖర్గేకు పగ్గాలు..?

కాంగ్రెస్​కు నమ్మిన బంటుగా ఉంటున్న సీనియర్ నేత మల్లికార్జున ఖర్గేకు రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్షనేతగా బాధ్యతలు అప్పజెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాహుల్​ గాంధీతో సాన్నిహిత్యం, దళిత నేత కావడం మొదలైన అంశాలు ఖర్గే వైపు ముగ్గు చూపేలా చేస్తాయని.. ఆయనకు పదవిని అప్పగిస్తే పార్టీకి ఉపయోగమేనని కాంగ్రెస్​ వర్గాలు భావిస్తున్నాయి. ఆజాద్​ పదవీ విరమణను దృష్టిలో పెట్టుకునే కాంగ్రెస్​ ఖర్గేను రాజ్యసభలో కూర్చోబెట్టిందని సమాచారం.

ఆజాద్​ రీఎంట్రీ!

ఈ ఏడాది ఏప్రిల్​ నాటికి కేరళకు చెందిన మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవనున్నాయి. వీటిలో ఒకటి కాంగ్రెస్​కు దక్కుతుంది. ఈ పదవిని భర్తీ చేసేందుకు ఆజాద్​ మళ్లీ ఎన్నికల్లో పాల్గొని ఎగువ సభకు రావచ్చు. కానీ ఆజాద్​ రాజ్యసభలో రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు తక్కువ.

ఇదీ చదవండి : రాజకీయ భవితవ్యంపై ఆజాద్ కీలక వ్యాఖ్యలు

Last Updated : Feb 12, 2021, 11:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.