ETV Bharat / bharat

గవర్నర్​కు మమత షాక్... ఇకపై ఆ హోదా ముఖ్యమంత్రిదే! - బెంగాల్ గవర్నర్ యూనివర్సిటీ వీసీ

Bengal universities VC governor: బంగాల్​లో సీఎం, గవర్నర్ మధ్య నెలకొన్న వివాదం మరో స్థాయికి చేరింది. గవర్నర్​ను రాష్ట్ర యూనివర్సిటీల ఛాన్స్​లర్​గా తొలగించి.. ఆ స్థానంలో సీఎంను నియమించేలా రూపొందించిన ముసాయిదా చట్టానికి కేబినెట్ ఆమోద ముద్రవేసింది.

bengal universities vc governor
bengal universities vc governor
author img

By

Published : May 26, 2022, 6:17 PM IST

West Bengal CM vs Governor: ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, గవర్నర్ జగ్​దీప్​ ధన్​కడ్ మధ్య తీవ్ర అభిప్రాయభేదాలు నెలకొన్న నేపథ్యంలో బంగాల్ కేబినెట్ కీలక బిల్లును ప్రతిపాదించింది. బంగాల్​లోని రాష్ట్రస్థాయి విశ్వవిద్యాలయాలకు ఛాన్స్​లర్​గా గవర్నర్​ స్థానంలో.. ముఖ్యమంత్రిని నియమించాలని ముసాయిదా బిల్లు రూపొందించింది. దీనికి కేబినెట్ ఆమోదం తెలిపిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బ్రత్య బసు తెలిపారు. దీన్ని త్వరలో రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు.

"రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే యూనివర్సిటీలన్నింటికీ ముఖ్యమంత్రిని ఛాన్స్​లర్​గా నియమించాలన్న ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. గవర్నర్ స్థానంలో ముఖ్యమంత్రి ఇకపై ఛాన్స్​లర్​గా ఉంటారు. త్వరలోనే ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెడతాం."
-బ్రత్య బసు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి

ప్రస్తుతం రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు గవర్నర్ ఛాన్స్​లర్​గా ఉంటున్నారు. ఈ బిల్లుకు అసెంబ్లీతో పాటు గవర్నర్ ఆమోదం లభిస్తే.. అమలులోకి వస్తుంది. ఆ తర్వాత యూనివర్సిటీలకు ఛాన్స్​లర్​గా ముఖ్యమంత్రి వ్యవహరిస్తారు. దీంతో యూనివర్సిటీలపై గవర్నర్ తన అధికారం కోల్పోనున్నారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.