Weekly Horoscope: ఈ వారం (డిసెంబర్ 26 - జనవరి 1) మీ రాశి ఫలాల గురించి డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి చెప్పిన సంగతులు..

ముఖ్య కార్యాలను జాగ్రత్తగా పూర్తి చేయండి. అనేక అవరోధాలున్నాయి. మితబాషణం మేలు. వ్యాపారంలో స్వల్ప ఆటంకముంది. ఆత్మవిశ్వాసం తగ్గకూడదు. స్పష్టమైన కార్యాచరణతో ఫలితం ఉంటుంది. కుటుంబ సభ్యులతో అన్యోన్యంగా ఉండాలి. అపార్థాలకు అవకాశముంది. ఆంజనేయ స్వామిని ధ్యానించండి, శాంతి లభిస్తుంది.

ఆలోచనల్లో స్పష్టత అవసరం. అడుగడుగునా విఘ్నాలున్నాయి. దేనికీ తొందరవద్దు. కాలాన్ని సత్కార్యాలకై వినియోగించండి. ధర్మదేవతానుగ్రహం లభిస్తుంది. సొంత నిర్ణయాలు ఇబ్బంది కలిగిస్తాయి. గందరగోళస్థితి ఏర్పడకుండా చూసుకోవాలి. ఉద్యోగంలో నిందలు భరించాల్సివస్తుంది. ఇష్టదేవతను దర్శించండి, శక్తి లభిస్తుంది.

ఉత్తమకాలం నడుస్తోంది. సమయానికి పనులు అవుతాయి. దైవానుగ్రహంతో లక్ష్యాన్ని చేరుకుంటారు. ఉద్యోగంలో బాగుంటుంది. ఆర్థికంగా కలిసివస్తుంది. ఆలోచనలకు కార్యరూపాన్నిస్తారు. భూ గృహ- వాహనాది యోగాలున్నాయి. సుఖసంతోషాలు ఉంటాయి. ఇంట్లోవారికి ప్రేమానురాగాలను పంచండి. బాధ్యతలను పూర్తి చేస్తారు. ఇష్టదేవతారాధన మేలుచేస్తుంది.

అదృష్టయోగముంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. అభీష్టసిద్ధి ఉంటుంది. ఆత్మపరిశీలనతో బంగారు భవిష్యత్తు లభిస్తుంది. అధికారలాభముంది. ప్రశంసలు లభిస్తాయి. పట్టుదలతో చేసే పనులు విజయాన్ని ఇస్తాయి. ఆవేశానికి దూరంగా ఉండాలి. కావాలని ఇబ్బంది పెట్టేవారున్నారు. సొంత నిర్ణయం మేలుచేస్తుంది. విష్ణుస్మరణ శక్తిని ప్రసాదిస్తుంది.

పనుల్ని చాకచక్యంగా చక్కబెట్టుకోవాలి. తెలియని ఆటంకాలున్నాయి. ఉద్యోగంలో ఏకాగ్రత ముఖ్యం. అదృష్టయోగం దగ్గరలోనే ఉంది. పదిమందికీ ఉపయోగపడే పనులు చేసి పేరు ప్రతిష్ఠలు సంపాదిస్తారు. ఈర్ష్య పడేవారున్నారు. శాంతంగా ముందుకు సాగాలి. సాగతీత ధోరణి పనికిరాదు. సూర్యధ్యానం మంచిది.

ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో అనుకున్న స్థాయికి చేరుకుంటారు. ఆశయాలు కార్యరూపాన్ని దాలుస్తాయి. వ్యాపారం బాగుంటుంది. సౌఖ్యవంతమైన జీవితం లభిస్తుంది. నూతన కార్యాలను ప్రారంభించండి. మంచిమనసుతో చేసే పనులు ఉత్తమ ఫలితాన్నిఇస్తాయి. సూర్యనమస్కారం శుభప్రదం.

సానుకూల దృక్పథంతో పని చేయండి. ఉద్యోగంలో ఒక మెట్టు పైకి ఎక్కుతారు. వ్యాపారరీత్యా అనుకూల ఫలితాలుంటాయి. శాంతచిత్తంతో నిర్ణయాలు తీసుకోండి. లక్ష్యాన్ని చేరే క్రమంలో శ్రమ తగ్గుతుంది. మితభాషణం మేలు, ఇతరుల మాటలు పట్టించుకోవద్దు. నైపుణ్యానికి అదృష్టం తోడవుతుంది. మిత్రులతో చర్చించి ముందడుగేయండి. శివధ్యానం శుభాన్నిస్తుంది.

మంచి మనసుతో పని మొదలుపెట్టండి, సందేహం ఉండకూడదు. ఉద్యోగంలో కష్టపడాలి. వ్యాపారం కలిసివస్తుంది. నమ్మకంగా అడుగు ముందుకేయండి. చెడ్డ ఆలోచనలు రానివ్వద్దు. అంతా మన మంచికే అన్న ధోరణి రక్షిస్తుంది. ఎదురుచూస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది. ఆర్థికంగా లాభపడతారు. సూర్యదర్శనం శుభప్రదం.

ఆర్థికయోగం శుభప్రదం. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి. ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది. గృహ ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతోషకరమైన వార్తలు వింటారు. ముందు వెనుక ఆలోచించి ఖర్చు చేయాలి. మొహమాటంతో సమస్యలు వస్తాయి. మాటల్లో స్పష్టత అవసరం. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఇష్టదేవతాస్మరణ మంచిది.

ఉద్యోగంలో కృషి ఫలిస్తుంది. గుర్తింపూ విజయం లభిస్తాయి. ఆవేశపరిచే వ్యక్తులుఉన్నారు. సొంత విషయాలను ఇతరులతో చర్చించవద్దు. పట్టుదలతో వ్యవహరించండి. పెద్దల ఆశీర్వచనముంటుంది. ఆర్థికంగా లాభపడతారు. వ్యాపారంలో జాగ్రత్త. మొహమాటం ఇబ్బంది కలిగిస్తుంది. ఇష్టదైవస్మరణ శ్రేయస్కరం.

ఉద్యోగంలో అద్భుతమైన విజయం ఉంది. అధికారుల ప్రశంసలు లభిస్తాయి. వ్యాపార లాభాలు విశేషంగా ఉంటాయి. తెలియని ఖర్చు ఉంటుంది. స్థిరాస్తులు పెరుగుతాయి. వారం మధ్యలో అదృష్టయోగముంది. ప్రణాళికాబద్ధంగా పని చేయండి. అవరోధాలను సునాయాసంగా అధిగమిస్తారు. కష్టపడితే బంగారు భవిష్యత్తు లభిస్తుంది. ఇష్టదేవతాస్మరణ మనశ్శాంతిని ఇస్తుంది.

అదృష్టవంతులవుతారు. ఎదురుచూస్తున్న పనులు పూర్తి అవుతాయి. ఉద్యోగపరంగా కలిసివస్తుంది. అధికారుల ప్రశంసలు లభిస్తాయి. సకాలంలో లక్ష్యాన్ని చేరుకుంటారు. భూ గృహ యోగాలున్నాయి. వారం మధ్యలో కార్యసిద్ధి ఉంటుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాదాలకు తావివ్వవద్దు. శాంతంగా మాట్లాడాలి. సమయస్ఫూర్తి రక్షిస్తుంది. శివస్మరణ మంచిది.