ETV Bharat / bharat

'కరోనా పోరు చివరి దశలో ఉన్నాం' - కేంద్ర వైద్య శాఖ మంత్రి హర్షవర్ధన్ జనౌషధి కేంద్రాలు

కరోనా పోరులో భారత్ చివరి దశకు చేరుకుందని.. ఈ స్థితిలో విజయం సాధించాలంటే టీకా పంపిణీ కార్యక్రమంపై రాజకీయాలు చేయకూడదని కేంద్ర వైద్య శాఖ మంత్రి హర్షవర్ధన్ పేర్కొన్నారు. టీకా అభివృద్ధి వెనక ఉన్న సైన్స్​ను విశ్వసించాలని అన్నారు. వ్యాక్సిన్ సరఫరా విషయంలో భారత్​కు ఇబ్బందులు లేవని స్పష్టం చేశారు.

HARSHVARDHAN
హర్షవర్ధన్
author img

By

Published : Mar 8, 2021, 5:49 AM IST

కరోనా పోరులో చివరి దశకు చేరుకున్నామని కేంద్ర వైద్య శాఖ మంత్రి హర్షవర్ధన్ పేర్కొన్నారు. ఈ దశలో విజయం సాధించాలంటే రాజకీయాలను టీకా పంపిణీ నుంచి దూరంగా ఉంచాలని కోరారు. టీకా అభివృద్ధి వెనక ఉన్న శాస్త్రీయత​పై ప్రజలు నమ్మకం ఉంచాలని అన్నారు. తమ సన్నిహితులందరూ వ్యాక్సిన్ వేయించుకునేలా చూడాలని పిలుపునిచ్చారు.

ఆదివారం దిల్లీ మెడికల్ అసోసియేషన్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. దేశంలో ఇప్పటివరకు 2 కోట్లకు పైగా టీకా డోసులను అందించినట్లు తెలిపారు. వ్యాక్సినేషన్ రేటు రోజుకు 15 లక్షల డోసులు అందించే స్థాయికి చేరిందని చెప్పారు. ఇతర దేశాల్లా కాకుండా టీకా సరఫరా విషయంలో భారత్​కు ఇబ్బందులు లేవని అన్నారు. టీకా జాతీయవాదాన్ని నిర్మూలించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ప్రపంచదేశాల్లో మహమ్మారి వ్యాప్తి కొనసాగితే.. భారత్ కరోనా నుంచి సురక్షితంగా ఉండలేదని అన్నారు.

"కొవిడ్ మహమ్మారి అంతిమ దశలో ఉన్నాం. ఈ దశలో విజయం సాధించాలంటే మనం మూడు అంశాలను పాటించాల్సి ఉంటుంది. వ్యాక్సినేషన్ నుంచి రాజకీయాలను దూరంగా ఉంచాలి. టీకా అభివృద్ధి వెనక ఉన్న సైన్స్​ను విశ్వసించాలి. మన సన్నిహితులంతా సరైన సమయంలో టీకా తీసుకునేలా చూడాలి. ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ టీకా అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అవసరమైతే వారు కూడా రోజుకు 24 గంటలు టీకా అందించవచ్చు. అర్హులైన వారందరూ తప్పకుండా వ్యాక్సిన్ స్వీకరించాలని కోరుతున్నా."

-హర్షవర్ధన్, కేంద్ర వైద్య శాఖ మంత్రి

ప్రధాని మోదీ నేతృత్వంలో భారత్.. ప్రపంచ ఫార్మా దిగ్గజంగా అవతరించిందని తెలిపారు హర్షవర్ధన్. 62 దేశాలకు 5.51 కోట్ల టీకా డోసులను పంపినట్లు వివరించారు.

జనౌషధి భేష్!

కరోనా సమయంలో జనౌషధి కేంద్రాలు విలువైన సేవలను అందించాయని అన్నారు హర్షవర్ధన్. లాక్​డౌన్ సమయంలో ఈ కేంద్రాల్లో విక్రయాలు పెరిగాయని చెప్పారు. 'పీఎం భారతీయ జనౌషధి పరియోజన' పథకం కింద 2008-2014 మధ్య 86 కేంద్రాలు ఏర్పాటయ్యాయని.. ఆ తర్వాతి ఆరు సంవత్సరాల కాలంలో ఈ సంఖ్య 7,300కు చేరిందని చెప్పారు. 2021 మార్చి 7 నాటికి దేశ వ్యాప్తంగా 7,500 జనౌషధి కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. 2024 నాటికి వీటి సంఖ్యను 10 వేలకు చేర్చాలని సంకల్పించుకున్నట్లు స్పష్టం చేశారు. ఈ కేంద్రాలు చాలా మందికి ఉపాధిని కల్పిస్తున్నాయని వివరించారు. 15 వేల మంది వివిధ స్థాయిల్లో ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నారని, వెయ్యి కేంద్రాలను మహిళలు నడిపిస్తున్నారని వెల్లడించారు.

ఇదీ చదవండి: ''మోదీ దుకాణం'లో ఔషధాలు కొనండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.