ETV Bharat / bharat

కిడ్నాపర్ల పనిబట్టేందుకు కానిస్టేబుల్ సాహసం.. కారుపైకి దూకి...

సినీ ఫక్కీలో జరిగిన ఓ పోలీస్​ ఛేజ్​ సోషల్​ మీడియాలో వైరలైంది. కారులో తప్పించుకు పారిపోతున్న కిడ్నాపర్లను ఎలాగైనా పట్టుకునేందుకు ఓ కానిస్టేబుల్​ ప్రాణాలకు తెగించాడు. అతడి​ సాహసం వల్ల మూడు కిలోమీటర్ల ఛేజ్​ తర్వాత కిడ్నాపర్లను పోలీసులు పట్టుకున్నారు.

kidnapers chase
కిడ్నాపర్లను పట్టుకునేందుకు పోలీస్​ ఛేజ్​
author img

By

Published : Oct 7, 2021, 4:31 PM IST

Updated : Oct 7, 2021, 7:54 PM IST

కిడ్నాపర్లను పట్టుకునేందుకు పోలీస్​ ఛేజ్

కిడ్నాపర్లను పట్టుకునేందుకు పక్కా ప్రణాళికతో మాటు వేసి ఉండటం.. తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే వారిని ఛేజ్​ చేసి మరీ పట్టుకోవడం సినిమాల్లో తరచూ చూస్తుంటాం. తమిళనాడులోని చెన్నైలో ఇలాంటి ఘటనే జరిగింది. ఓ కానిస్టేబుల్​.. తప్పించుకు పారిపోతున్న కిడ్నాపర్లను పట్టుకునేందుకు ప్రాణాలకు తెగించాడు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సోషల్​ మీడియాలో వైరల్​ అయ్యాయి.

ఇదీ జరిగింది..

చెట్​పట్​లోని హ్యారింగ్​టన్​ రోడ్డులో నివసించే మూసా అనే ఓ రిటైర్డ్​ ఎస్​ఐను ఈనెల 5న దుండగులు అపహరించారు. అతడి కుమారుడైన బషీర్​కు కాల్​ చేసి.. మంగళవారం రాత్రి ఎగ్మోర్​ స్టేషన్​కు వచ్చి రూ.25 లక్షలు ఇవ్వాలని డిమాండ్​ చేశారు. అప్పటికే బషీర్​ పోలీసులకు ఫిర్యాదు చేయడం వల్ల కిడ్నాపర్లు చెప్పిన ప్రాంతానికి పోలీసులు కూడా మఫ్టీలో వచ్చారు.

బషీర్​ నుంచి డబ్బు తీసుకున్న కిడ్నాపర్లు.. మూసాను విడిచిపెట్టారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు కిడ్నాపర్లను చుట్టుముట్టారు. కారులో పరరయ్యేందుకు ప్రయత్నించిన నిందితులను పట్టుకునేందుకు కానిస్టేబుల్​ శరవణకుమార్​ ఆ కారుపైకి దూకాడు. మూడు కిలోమీటర్ల వరకు ఆ కారు బానెట్​పైనే వేళ్లాడాడు. చివరికి.. అదుపు తప్పడం వల్ల కిడ్నాపర్ల కార్లు ఓ గోడకు ఢీకొంది. ఈ క్రమంలో శరవణకుమార్​కు స్వల్ప గాయాలయ్యాయి.

శరవణకుమార్​ సాహసంతో పట్టుబడిన కిడ్నాపర్లను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ కేసులో ట్విస్ట్​ ఏంటంటే కిడ్నాప్​కు గురైన 80 ఏళ్ల మూసా అక్రమ సరకును రవాణా చేస్తుండేవాడు. అతని వద్దే కిడ్నాపర్లలో ప్రధాన నిందితుడైన అరుప్​ కుమార్​ పనిచేసేవాడు. మూసా తనకు ఇవ్వాల్సిన డబ్బు బాకీ ఉండటం వల్లే అతను ఈ కిడ్నాప్​కు ప్రయత్నించాడు.

ఇదీ చూడండి : పాఠశాలలో ఉగ్రవాదుల కాల్పులు- ఇద్దరు ఉపాధ్యాయులు మృతి

Last Updated : Oct 7, 2021, 7:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.