ETV Bharat / bharat

ఓరుగల్లు ఖిల్లాపై ఏ పార్టీ జెండా ఎగురునో- నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్న ప్రధాన పార్టీలు - వరంగల్ ఎన్నికల 2023 ఎమ్మెల్యే అభ్యర్థులు

Warangal Politics Telangana Assembly Election 2023: చారిత్రక నగరంగా భాసిల్లుతున్న ఉమ్మడి ఓరుగల్లు జిల్లాలోని.. 12 నియోజకవర్గాల్లో నువ్వా నేనా అన్నట్లుగా ఎన్నికల యుద్ధం కొనసాగుతోంది. రాజకీయ చైతన్యానికి మారుపేరైన జిల్లాలో ప్రధాన పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పన్నెండుకు 10 స్ధానాల్లో గెలుపు బావుటా ఎగురవేసిన భారత రాష్ట్ర సమితి.. ఈసారి అదే జోరు కొనసాగించేందుకు శ్రమిస్తోంది. బీఆర్ఎస్ హవాకు గండికొట్టి.. సాధ్యమైనన్ని ఎక్కువ స్ధానాల్లో జయకేతనం ఎగరేసేందుకు కాంగ్రెస్‌ తహతహలాడుతోంది. కొన్ని స్ధానాల్లోనైనా గట్టి పోటీ ఇచ్చి.. ప్రధాన పార్టీ అభ్యర్ధులను ఖంగుతినిపించాలని బీజేపీ భావిస్తోంది.

Warangal Political History
Warangal Politics Telangana Assembly Election 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 9, 2023, 5:46 AM IST

ఓరుగల్లు ఖిల్లాపై ఏ పార్టీ జెండా ఎగురునో- నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్న ప్రధాన పార్టీలు

Warangal Politics Telangana Assembly Election 2023: ఉమ్మడి ఓరుగల్లు జిల్లాది రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర. హైదరాబాద్ తర్వాత అంతటి పేరున్న నగరం 'వరంగల్‌'.. ఈ జిల్లాలోనే ఉంది. ఓరుగల్లు ఖిల్లాపై ఈసారి ఏ పార్టీ జెండా రెపరెపలాడుతుందనేది ఆసక్తిగా మారింది. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో త్రిముఖ పోరు ఉత్కంఠ రేపుతోంది. బీఆర్ఎస్ నుంచి ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్ భాస్కర్, కాంగ్రెస్ నుంచి నాయని రాజేందర్‌రెడ్డి, బీజేపీ నుంచి రావు పద్మ బరిలో నిలిచారు.

2009 నుంచి వరసగా విజయం సాధిస్తున్న వినయ్‌ భాస్కర్‌.. కోట్లాది రూపాయలతో నియోజకవర్గంలో చేసిన అభివృద్ధే తనని గెలిపిస్తుందనే ధీమాతో ఉన్నారు. వానకాలంలో వరద కష్టాలు.. ప్రతికూల అంశంగా ఉంది. ఆరు గ్యారంటీలు(Congress Six Guarantees), సర్కారు మార్పు నినాదం.. తనను గట్టిక్కేస్తుందని నాయని భావిస్తున్నారు. కమలం పార్టీ అభ్యర్థి రావు పద్మ సైతం జోరుగా ప్రచారం చేస్తున్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో.. బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌ కాంగ్రెస్ అభ్యర్ధిగా కొండా సురేఖ, బీజేపీ నుంచి ఎర్రబెల్లి ప్రదీప్‌రావు తలపడుతున్నారు.

Warangal Political vibes in Assembly Elections: భారతీయ జనతా పార్టీ అభ్యర్ధికొచ్చే ఓట్లు.. ఆ పార్టీ అభ్యర్ధిని గెలిపిస్తాయా..? ఓట్లు చీలి బీఆర్ఎస్, కాంగ్రెస్‌ అభ్యర్థుల్లో ఎవరికి లాభం కలుగుతుందో.. తెలియని పరిస్థితి నెలకొంది. పాలకుర్తి నియోజకవర్గాన్ని కంచుకోటగా మార్చుకున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు(Minister Errabelli Dayakar Rao) ఈసారి కాంగ్రెస్ నుంచి ఎన్ఆర్ఐ మామిడాల ఝాన్సీరెడ్డి కోడలు యశస్వినిరెడ్డి పోటీనిస్తున్నారు. ఝాన్సీరెడ్డినే నిలుచుందామనుకున్నా.. భారత పౌరసత్వం రాకపోవడంతో.. కొడలిని బరిలోకి దింపారు. వరుస విజయాలు సాధిస్తున్న ఎర్రబెల్లికి.. రాజకీయాల్లో తొలిసారి అరంగ్రేటం చేసిన యశస్వినీ మధ్య పోరు ఆసక్తికరంగా మారింది.

ఈనెల 11న హైదరాబాద్​కు ప్రధాని మోదీ - షెడ్యూల్​ ఇదే

ఉద్యమాల గడ్డగా పేరొందిన నర్సంపేటలో పాతకాపులే మరోసారి తలపడుతున్నారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి బీఆర్ఎస్ నుంచి మరోసారి పోటీ పడుతుండగా.. కాంగ్రెస్‌ నుంచి దొంతి మాధవరెడ్డి సై అంటున్నారు. అభివృద్ధి కార్యక్రమాలే తనను అందలమెక్కిస్తాయని సుదర్శన్‌రెడ్డి విశ్వసిస్తుండగా.. కాంగ్రెస్ గ్యారంటీలపై మాధవరెడ్డి ఆశలు పెట్టుకున్నారు.

Warangal Election 2023 MLA Candidates :మానుకోట రాళ్ల దాడిలో తెలంగాణ మలిదశ పోరాటంలో(Telangana Malidasha Struggle) చరిత్ర లిఖించిన మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో... బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌, కాంగ్రెస్‌ అభ్యర్థి డాక్టర్‌ మురళీ నాయక్‌, బీజేపీ అభ్యర్థి జాటోత్‌ హుస్సేన్‌ నాయక్‌ తలపడుతున్నారు. రెండు నెలల ముందు నుంచే విస్తృతంగా ప్రచారం చేస్తున్న శంకర్‌ నాయక్‌.. హ్యాట్రిక్‌ విజయంపై ధీమాగా ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి మురళీ నాయక్‌ మానుకోటలో ప్రజలకు సుపరిచితులు. కమలం పార్టీ అభ్యర్థి హుస్సేన్‌ నాయక్‌ పల్లెపల్లెకు బీజేపీ పేరుతో ఇప్పటికే నియోజకవర్గాన్ని చుట్టేశారు.

గిరిజనులు ఏ పార్టీని ఆదరిస్తారనేదిపై ఈ స్థానంలో పార్టీల విజయావకాశాలు ఆధారపడి ఉంటుంది. ఘనాపాటీలకు రాజకీయ కేంద్రంగా పేరుగాంచిన స్టేషన్‌ఘన్‌పూర్‌లో మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి గులాబీ పార్టీ తరఫున బరిలోకి దిగగా.. కాంగ్రెస్ నుంచి గత ఎన్నికల్లో ఓటమి పాలైన సింగపురం ఇందిర.. మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. బీజేపీ నుంచి విజయరామారావు పోటీ చేస్తున్నారు.

Warangal Political History: నిజాం నిరంకుశ పాలనకు(Nizam's Autocratic Rule) వ్యతిరేకంగా పోరాడిన గడ్డ 'పరకాల'. ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సిట్టింగ్‌ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి... హ్యాట్రిక్‌పై కన్నేశారు. కాంగ్రెస్ అభ్యర్ధిగా రేవూరి ప్రకాశ్‌రెడ్డి, బీజేపీ నుంచి ప్రముఖ వైద్యడు కాళీ ప్రసాద్ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ టిక్కెట్ ఆశించి భంగపడ్డ ఇనుగాల వెంకట్రామిరెడ్డి కీలకంగా మారారు. రేవూరికి ఎంత మేర ఆయన సహరిస్తారనే అంశం.. అభ్యర్థుల గెలుపొటముల్ని ప్రభావితం చేస్తుందని అంటున్నారు. డోర్నకల్ నియోజకవర్గాన్ని కంచుకోటగా మార్చుకున్న సిట్టింగ్‌ ఎమ్మెల్యే రెడ్యానాయక్‌.. మరోసారి బీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగారు.

24 గంటల కరెంట్‌ ముసుగులో వేల కోట్ల దోపిడీ చేశారు : రేవంత్‌ రెడ్డి

ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్ నేతకు పోటీగా కాంగ్రెస్‌ నుంచి రామచంద్రునాయక్ బరిలోకి దిగారు. కాంగ్రెస్‌ నేతలు నెహ్రూ నాయక్, బెల్లయ్య నాయక్ సహకారంపైనే కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు అవకాశాలున్నాయి. తెలంగాణ సాయుధ పోరాటానికి, నక్సల్‌ ఉద్యమానికి(Naxal శovement) వెన్నుదన్నుగా నిలిచిన జనగామ నియోజకవర్గం((Constituency Development).. ఒకప్పుడు కరవు ప్రాంతం. దేవాదుల నీళ్లతో మూడు పంటలు పండే స్థాయికి చేరుకుంది. జనగామ నియోజకవర్గంలో గత రెండు ఎన్నికల్లో గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి ఈసారి బీఆర్ఎస్ టిక్కెట్‌ దక్కలేదు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఈసారి అధికార పార్టీ నుంచి అదృష్టం పరీక్షించుకుంటున్నారు.

Telangana Assembly Election 2023:కాంగ్రెస్‌ టిక్కెట్‌ కొమ్మూరి ప్రతాప్‌రెడ్డిని వరించగా.. సీనియర్‌ నేత పొన్నాల లక్ష్మయ్య పార్టీని వీడి గులాబీ గూటికి చేరారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డికి.. ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఏ మేరకు సహరిస్తారనేది విజయావకాశాలను ప్రభావితం చేయనుంది. హోరాహోరీ పోరులో పల్లా, కొమ్మూరిలో ఎవరు గెలిచినా.. స్వల్ప ఆధిక్యంతో బయటపడతారని అంచనా వేస్తున్నారు. సింగరేణి కార్మికుల(Singareni Workers) నిలయం భూపాలపల్లి నియోజకవర్గం. 2018లో కాంగ్రెస్‌ నుంచి గెలిచిన గండ్ర వెంకటరమణారెడ్డి.. ఆ తర్వాత బీఆర్ఎస్​లో చేరారు. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ నుంచి పోటీ చేస్తున్న ఆయనకు.. కాంగ్రెస్ నుంచి గండ్ర సత్యనారాయణరావు, బీజేపీ నుంచి చందుపట్ల కీర్తిరెడ్డి గట్టి పోటీనిస్తున్నారు. తలోదారిగా ఉన్న మాజీ స్పీకర్‌ మధుసూధనాచారి, వెంకటరమణారెడ్డి వర్గీయులు కలిసి పనిచేయడంపై బీఆర్ఎస్ గెలుపు ఆధారపడి ఉంటుందనే అభిప్రాయాలున్నాయి.

'సింగరేణిని ముంచింది కాంగ్రెస్​ - లాభాల బాట పట్టించింది బీఆర్​ఎస్'​
కాంగ్రెస్ అభ్యర్ధి గండ్ర సత్యనారాయణరావుపై నియోజకవర్గ ప్రజల్లో ఉన్న సానుభూతి కీలకం కానుంది. ఎస్సీ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గమైన వర్ధన్నపేటలో.. గత రెండు ఎన్నికల్లో గులాబీ జెండా రెపరెపలాడింది. భారీ ఆధిక్యంతో రెండుసార్లు గెలిచిన సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌ హ్యాట్రిక్ సాధించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి విశ్రాంత ఐపీఎస్ నాగరాజు, బీజేపీ నుంచి కొండేటి శ్రీధర్‌ పోటీలోకి దిగారు. బీఆర్ఎస్ - కాంగ్రెస్(Congress Party) పార్టీల మధ్య హోరాహోరీ నెలకొనగా... విజయంపై ఎవరి అంచనాల్లో వారున్నారు.

Warangal Election History: వనదేవతలు కొలువైన ములుగు నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే సీత్కక్క(MLA Seethakka), బీఆర్ఎస్ నుంచి జడ్పీ ఛైర్‌పర్సన్‌ బడే నాగజ్యోతి పోటీ చేస్తున్నారు. మావోయిస్టు నేపథ్యం కలిగిన ఇద్దరు మహిళలూ హోరాహోరీగా తలపడుతున్నారు. కరోనా, వరదల వేళ ప్రజలకు సేవలందించిన పేరు సీత్కక్కకు ఉంది. సీతక్క గెలిచి.. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే.. ఆమెకు మంత్రి పదవి ఖాయమనే ప్రచారం జరుగుతోంది. తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన నాగజ్యోతి నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ములుగులో బీఆర్ఎస్ సర్కార్‌ చేసిన అభివృద్ధిని వివరిస్తున్నారు. ఉమ్మడి ఓరుగల్లు జిల్లాలో ఈసారి ఓటరు తీర్పు ఎలా ఉంటుందోననే అంశం ఆసక్తి రేపుతోంది.

గెలుపు బాటలో అభ్యర్థుల హోరాహోరీ-పాదయాత్రలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఓట్ల వేట

'మోదీ మేడిగడ్డను ఎందుకు పరిశీలించలే - బీజేపీ, బీఆర్ఎస్ రెండు ఒక్కటే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.