గుజరాత్లో స్థానిక పోరు జోరుగా సాగుతోంది. రాష్ట్రంలోని 81 మున్సిపాలిటీలు, 31 జిల్లా పంచాయతీలు, 231 తాలుకా పంచాయతీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 6 గంటలకు ముగియనుంది.
కేంద్ర పంచాయతీ రాజ్, వ్యవసాయ శాఖ సహాయ మంత్రి పర్షోత్తమ్ రూపాలా.. అమ్రేలీ వార్డులో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. భాజపా రాజ్యసభ సభ్యుడు జుగల్జీ ఠాకూర్.. మెహ్సానాలో ఓటు వేశారు.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 8,474 స్థానాలకు గానూ.. 36వేల పోలింగ్ బూత్‌ల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 3.04 కోట్ల మంది ఓటర్లు ఇందులో పాలొంటున్నట్టు అధికారులు తెలిపారు. ఈ మేరకు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. 44 వేల మంది పోలీసు సిబ్బంది సహా.. 12 సీఏపీఎఫ్ కంపెనీలు, 54,000 మంది హోంగార్డులు.. ఎన్నికల విధులు నిర్వహిస్తున్నట్టు చెప్పారు.
మార్చి 2న ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది.
ఇదీ చదవండి: గుజరాత్ స్థానిక సమరం: ఓటు వేయనున్న 3.4 కోట్ల మంది