ETV Bharat / bharat

పోలింగ్​ బూత్​ ముందే కాల్పులు- తొలి ఓటరు మృతి

బంగాల్​లో నాలుగో విడత పోలింగ్​ సందర్భంగా కూచ్​బెహార్​ జిల్లా సీతల్​కుచిలో కాల్పులు జరిగాయి. మొదటిసారి ఓటు వేసేందుకు వచ్చిన ఓ వ్యక్తిని కాల్చిచంపారు దుండగులు. హత్యపై భాజపా, టీఎంసీ నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు.

voter shot dead outside polling booth
బంగాల్​లో పోలింగ్​ బూత్​ ముందే కాల్పులు
author img

By

Published : Apr 10, 2021, 11:28 AM IST

Updated : Apr 10, 2021, 11:59 AM IST

బంగాల్​ నాలుగో విడత పోలింగ్​లో కాల్పులు కలకలం సృష్టించాయి. కూచ్​బెహార్​ జిల్లా సీతల్​​కుచిలోని ఓ పోలింగ్​ బూత్​ ముందే ఓటరును కాల్చి చంపారు దుండగులు. ఈ హత్య భాజపా పనేనని టీఎంసీ ఆరోపించింది. మృతి చెందింది తమ కార్యకర్తేనని.. అధికార పార్టీనే ఈ దారుణానికి ఒడిగట్టిందని భాజపా ఆరోపించింది.

మృతి చెందిన యువకుడు ఆనంద్​ బుర్మన్.. తొలిసారి ఓటరు. మృతదేహాన్ని పతంతులి పోలింగ్​ బూత్​ 85 నుంచి బయటకు తీసుకువచ్చామని పోలీసు అధికారి వెల్లడించారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో టీఎంసీ, భాజపా కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగిందని చెప్పారు. పోలింగ్​ బూత్​ బయట కార్యకర్తలు బాంబులు విసురుకున్నారు. కేంద్ర బలగాలు రంగంలోకి దిగి లాఠీఛార్జ్​ జరిపాయని వెల్లడించారు.

''కూచ్​బెహార్​ జిల్లా సీతల్​కుచిలో పోలింగ్​ బూత్​ ముందే ఓ వ్యక్తిని కాల్చి చంపారని మాకు సమాచారం వచ్చింది. పూర్తి సమాచారం తెలుసుకోవడానికి రిటర్నింగ్​ అధికారిని పిలిచాము.''

-ఎన్నికల అధికారి

''ఈ హత్య వెనుక భాజపా గూండాలు ఉన్నారు. ఎన్నికల్లో ఓడిపోతామనే కొన్ని రోజుల నుంచి గందరగోళం సృష్టిస్తున్నారు. మనుషులను చంపడానికి వెనుకాడట్లేదు.''

-రవీంద్ర నాథ్​ ఘోష్,​ టీఎంసీ నాయకుడు

''చనిపోయిన వ్యక్తి మా కార్యకర్తే. టీఎంసీ కార్యకర్తలే ఈ హత్య వెనుక ఉన్నారు. రవీంద్ర నాథ్ ఘోష్​ అబద్ధాలు చెబుతున్నారు. హత్య జరిగే సమయంలో పోలీసులు, కేంద్ర బలగాలు లేవు. జిల్లా ఎస్పీ, ఈసీకి ఫిర్యాదు చేశాం. వీలైనంత త్వరలో దోషులను పట్టుకోవాలని కోరాం.''

-బరేన్ చంద్ర బర్మన్​, భాజపా నాయకుడు

ఇదీ చదవండి: ఒకేసారి 22 మృతదేహాలు దహనం.. ఎక్కడంటే?

Last Updated : Apr 10, 2021, 11:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.