ETV Bharat / bharat

ఓటర్ల జాబితాలో శశికళ పేరు గల్లంతు

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉండగా.. జయలలిత నెచ్చెలి శశికళ పేరు ఓటరు జాబితాలో కనిపించకపోవడం వివాదానికి దారి తీసింది. అన్నాడీఎంకేనే శశికళ పేరును తొలగించిందని ఏఎఎంఎంకే ఆరోపించింది.

VK Sasikala
ఓటర్​ లిస్టులో శశికళ పేరు మిస్సింగ్​
author img

By

Published : Apr 5, 2021, 1:53 PM IST

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలిలిత నెచ్చెలి, ఏఐఏడీఎంకే బహిష్కృత నేత వీకే శశికళ పేరు.. ఓటర్ల జాబితాలో కనిపించకపోవడం కలకలం రేపింది. తమిళనాడు అసెంబ్లీ పోలింగ్​కు ఒక్కరోజు ముందు ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

రెండు దశాబ్దాలుగా థౌజండ్​ లైట్స్​ నియోజకవర్గ పరిధిలో శశికళకు ఓటు హక్కు ఉంది. అయితే.. పోయెస్​ గార్డెన్​లోని ఆస్తులను జప్తు చేశాక.. అక్కడ నివసించే శశికళ, ఇలవరసి తదితరుల పేర్లను ఓటర్ల జాబితా నుంచి చెన్నై కార్పొరేషన్ తొలగించినట్లుగా తెలుస్తోంది.

శశికళ పేరును అన్నాడీఎంకేనే ఉద్దేశపూర్వకంగా తొలగించిందని ఏఎంఎంకే అధినేత టీటీవీ దినకరన్​ ఆరోపించారు.

ఇదీ చూడండి:'తరతరాల అవినీతికి కాంగ్రెస్, డీఎంకే నిదర్శనం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.