ETV Bharat / bharat

రెండు కుటుంబాల మధ్య గొడవ.. జేసీబీతో మహిళపైకి.. - etv bharat viral video

భూవివాదం కారణంగా రెండు వర్గాలు దారుణంగా కొట్టుకున్నాయి. ఒకరిపై ఒకరు రాళ్లు, కర్రలతో విరుచుకుపడ్డారు. వీరిలో మహిళలు కూడా ఉన్నారు. ఓ మహిళను జేసీబీతో తొక్కించే ప్రయత్నం కూడా చేశారు. రాజస్థాన్​లో జరిగిన ఈ గొడవ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​ కాగా.. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

land dispute in india
రెండు కుటుంబాల మధ్య ఘర్షణ.. జేసీబీతో మహిళను..
author img

By

Published : Nov 18, 2021, 6:58 PM IST

భూవివాదంతో ఘర్షణ

రాజస్థాన్​ బాడ్​మేర్​ జిల్లాలోని బాయ్తులో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ చెలరేగింది. వారి మధ్య ఉన్న భూవివాదం ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఒకరిపై ఒకరు రాళ్లు, కర్రలతో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలోనే ఓ మహిళను జేసీబీతో తొక్కించేందుకు యత్నించారు.

ఈ ఘటనలో మహిళలు కూడా ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. జట్టు పట్టుకుని కొట్టుకున్నారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​కాగా.. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ భూమి ఎవరికి సొంతం అనే విషయంపై గత కొంతకాలంగా రెండు కుటుంబాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయని అధికారులు వివరించారు. చివరకు ఆ భూమిలో నిర్మాణం చేసేందుకు ఓ వర్గం వెళ్లగా.. వారిని అడ్డుకునేందుకు మరో వర్గం ప్రయత్నించిందని వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి పలువురిని అదుపులోకి తీసుకున్నట్టు స్పష్టం చేశారు.

సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారిన ఈ వీడియో.. గత వారానికి సంబంధించిందని తెలుస్తోంది.

ఇదీ చూడండి:- సింహాన్ని 'సెల్ఫీ గ్యాంగ్​' రౌండప్ చేస్తే...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.