ETV Bharat / bharat

Viral Video Father and Daughter Duo Cute Dance : కూతురుతో కలిసి తండ్రి డ్యాన్స్​.. క్యూట్​ ఎక్స్​ప్రెషన్​కు నెటిజన్లు ఫిదా! - కూతురుతో కలిసి తండ్రి డ్యాన్స్

Viral Video Father and Daughter Duo Cute Dance: తండ్రీ కూతుళ్ల బంధానికి పేరు పెట్టేది ఉండదు. కూతురు పుట్టినప్పటి నుంచి అల్లారుముద్దుగా పెంచుకుంటారు. అయితే ఇప్పటికే తండ్రి కూతుళ్ల ప్రేమకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. అలాంటి వీడియోలను మీరు చూసేయండి..

Viral_Video_Father_and_Daughter_Duo_Cute_Dance

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 9, 2023, 2:14 PM IST

Updated : Sep 9, 2023, 2:37 PM IST

Viral Video Father and Daughter Duo Cute Dance: ప్రస్తుత కాలంలో సామాజిక మాధ్యమాల వినియోగం పెరిగాక.. అనేక రకాల వీడియోలు క్షణాల్లో వైరల్​ అవుతున్నాయి. కొందరు కావాలని తమ టాలెంట్​కు సంబంధించిన వీడియోలు సోషల్​ మీడియాలో పోస్ట్​ చేస్తుండగా.. మరికొందరు తమకు తెలియకుండానే కంటెంట్​ క్రియేట్​ చేస్తున్నారు. అలా.. ఒక్క రాత్రిలోనే ఫేమస్ అయిన వారు.. సెలబ్రిటీలుగా మారిపోయిన వారు చాలా మందే ఉన్నారు. అయితే ఇక్కడ కూడా ఓ వీడియో జనాలను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఓ పెళ్లి వేడుకలో తండ్రి, కూతురు కలిసి చేసిన డ్యాన్స్​ వీడియో ఇన్​స్టాగ్రామ్​లో పోస్ట్​ చేయడంతో క్షణాల్లోనే వైరల్​ అయ్యింది. అందులో వారి పర్ఫామెన్స్​కి, వారి క్యూట్​ ఎక్స్​ప్రెషన్స్​కు అందరూ ఫిదా అయిపోతున్నారు.

Father and Daughter Relation : ఈ సృష్టిలో ప్రతీ బంధానికి ఓ అర్థం ఉంది. అందులో తండ్రి, కూతుళ్ల బంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కూతురిపై తండ్రి ప్రేమ‌కు హ‌ద్దులుండ‌వు. కూతుళ్లు తండ్రి మనసుకు చాలా దగ్గర ఉంటారు. తన కూతుర్ని మరో అమ్మగా ప్రతి తండ్రి భావిస్తాడు. పుట్టినప్పట్టి నుంచి మరో ఇంటికి కోడలుగా అడుగు పెట్టే వరకూ అరచేతుల్లో పెట్టుకుని అల్లారుముద్దుగా పెంచుతాడు. అయితే ఇప్పటికే తండ్రి కూతుళ్ల ప్రేమకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. తాజాగా ఓ వివాహ వేడుకలో తండ్రి, కూతురు కలిసి డ్యాన్స్​ చేసిన వీడియో కొద్దిరోజుల క్రితం వైరల్​ అవ్వగా.. ఇప్పటికీ దాని హవా కొనసాగుతూనే ఉంది.

Gavya Om Instagram: సోషల్​ మీడియాలో వైరల్​ అవుతున్న ఈ వీడియో.. 'గవ్య-ఓం' పేరుతో ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్​లో పోస్ట్​ అయ్యింది. క్లిప్​ ఓపెన్​ చేస్తే పెళ్లిలో సిద్ధం చేసిన స్టేజీపై.. తండ్రి కూతురు ఇద్దరూ ట్రెడిషనల్​ వేర్​లో నిల్చోని కనిపించారు. లిరిక్స్​ తగ్గట్టుగా ఒకరిని మించి ఒకరు అన్నట్లు ఎక్సెప్రెషన్స్​ పలికించారు. ఆ ఇద్దరి స్టెప్పులు కూడా పాట బీట్​లకు తగ్గట్టుగా ఉన్నాయి. పెళ్లికి వచ్చిన అతిథులు కూడా వారి డ్యాన్స్​ను చూసి ఫిదా అయిపోయారు. కేవలం వాళ్లే కాకుండా.. ఇన్​స్టాగ్రామ్​లో షేర్​ చేయడం దానిని చూసిన చాలా మంది పాప అభినయానికి ఫ్యాన్స్​ అయిపోయారు. ఇక ఆ వీడియో ఫేస్​బుక్​, వాట్సప్​, ఇన్​స్టా.. ఇలా సోషల్​ మీడియాలో షేర్​ చేయగా.. చూసిన వారందరూ లైక్​, కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. కాగా ఈ వీడియోకి ఇప్పటివరకు 1.2 మిలియన్​ లైకులు.. 11.5 మిలియన్​ వ్యూస్​​ వచ్చాయి.

About the Yeh Ladka Hai Deewana song : ఇక ఈ పాట విషయానికి వస్తే.. 1998లో రిలీజ్​ అయిన 'కుచ్ కుచ్ హోతా హై' సినిమాకు సంబంధించింది. దీనికి కరణ్ జోహార్ దర్శకత్వం వహించారు. షారుఖ్ ఖాన్, కాజోల్ ఈ పాటలో నటించారు. 'యే లడ్కా హై దీవానా'ను అల్కా యాగ్నిక్, ఉదిత్ నారాయణ్ పాడారు. జతిన్-లలిత్ కంపోజ్ చేసిన ఈ పాటకి సమీర్ లిరిక్స్ రాశారు.

పెళ్లి వేడుకలో ఎమ్మెల్యే అదిరే స్టెప్పులు.. వీడియో వైరల్​!

సుమ-అనసూయ డ్యాన్స్​ చూశారా.. భలే వేశారుగా​!

స్టేజ్​పై నరేశ్​-పవిత్ర రొమాంటిక్‌ డ్యాన్స్​.. చూశారా?

Last Updated : Sep 9, 2023, 2:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.