ETV Bharat / bharat

పామును చంపి యజమానిని కాపాడిన శునకం

author img

By

Published : Mar 1, 2021, 4:30 PM IST

తన యజమానిని రక్షించడం కోసం ప్రాణత్యాగం చేసింది ఓ శునకం. యజమాని ఫామ్​ హౌస్​​లోకి వచ్చిన పామును చంపి యజమానిని కాపాడింది. ఈ క్రమంలోనే కుక్క ప్రాణాలు కోల్పోయింది. 9ఏళ్లు అల్లారుముద్దుగా పెంచుకున్న శునకం.. తనకోసం ప్రాణ త్యాగం చేయగా యజమాని కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటన కర్ణాటక విజయపుర జిల్లాలో జరిగింది.

Vijayapura: A Dog sacrifices his life for save a owners Life
పామును చంపి యజమానిని కాపాడిన శునకం

విశ్వాసానికి మారు పేరు శునకం అనటానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. అలాంటి ఘటనే కర్ణాటక విజయపుర జిల్లా దేవరహిప్పరగి మండలంలో జరిగింది. ఫార్మ్​హౌస్​​లోకి వచ్చిన పామును చంపి.. యజమాని ప్రాణాలను రక్షించింది ఓ శునకం. అయితే ఈ ఘటనలో కుక్క చనిపోయింది.

Vijayapura: A Dog sacrifices his life for save a owners Life
యజమాని కల్లన్నతో రాజా

పాముతో పోరాడి మృతి చెందిన శునకం

శునకాన్ని ఖననం చేస్తున్న యజమాని

శునకం సమాధి

అసలేం జరిగింది?

కర్ణాటక విజయపుర జిల్లా దేవరహిప్పరగి మండలానికి చెందిన కల్లన్న గౌడ పాటిల్.. 9 ఏళ్ల క్రితం రూ. 5వేలకు ఓ శునకాన్ని కొన్నాడు. దానికి 'రాజా' అని నామకరణం చేసి పెంచుకుంటున్నాడు. కల్లన్న గౌడ ఫార్మ్​హౌస్​కు కాపాలాగా ఉండేది ఆ శునకం. అయితే రెండు రోజుల క్రితం కల్లన్న గౌడ.. పొలం పనిలో నిమగ్నమైన సమయంలో ఓ పాము అటుగా వచ్చింది. ఆ విషయాన్ని కల్లన్న గమనించలేదు. కానీ రాజా ఆ పాముతో పోరాడి.. దాన్ని చంపేసింది. పాము విష ప్రభావంతో కొద్దిసేపటికి కుక్క కూడా ప్రాణాలు విడిచింది.

9 ఏళ్లు పెంచుకున్న శునకం(రాజా) మృతితో కల్లన్న తీవ్ర విషాదంలో మునిగిపోయాడు.

ఇదీ చదవండి : ఇంటి ఓనర్​కు నిప్పంటించిన అద్దెదారు- చిన్నారి మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.