ETV Bharat / bharat

'ఇది దేశ ప్రతిష్ఠను దిగజార్చే ఘటన'

ఉత్తర్​ప్రదేశ్​లో క్రైస్తవ సన్యాసినులపై భజరంగ్​ దళ్​ కార్యకర్తల 'వేధింపుల' ఘటన రాజకీయ దుమారానికి కారణమైంది. ఇలాంటి ఘటనల వల్ల దేశ ప్రతిష్ఠ దెబ్బతింటుందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్​ ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు.. బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని కేంద్రం హోం మంత్రి అమిత్​ షా.. హామీ ఇచ్చారు.

Vijayan condemns 'harassment' of nuns by Hindu outfit members in UP
'ఇది దేశ ప్రతిష్ఠను దిగజార్చే ఘటన'
author img

By

Published : Mar 24, 2021, 4:26 PM IST

Updated : Mar 24, 2021, 10:13 PM IST

ఉత్తర్​ప్రదేశ్​ ఝాన్సీలో కేరళకు చెందిన క్రైస్తవ సన్యాసినుల(నన్​ల)ను భజరంగ్​ దళ్​ కార్యకర్తలు ​వేధించారన్న ఆరోపణలు దుమారానికి దారి తీశాయి. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని కేరళ క్యాథలిక్​ బిషప్స్​ కౌన్సిల్​ డిమాండ్​ చేసింది. ఈ విషయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దృష్టికి భాజపా, కాంగ్రెస్​ తీసుకువెళ్లాయి.

ఏం జరిగింది?

ఉత్తర్​ప్రదేశ్​ ఝాన్సీలో వేరే మతం నుంచి క్రైస్తవ మతంలోకి చేరాలనుకునే ఇద్దరు మహిళలు.. ఇద్దరు క్రైస్తవ సన్యాసినులతో కలిసి తమ స్వస్థలానికి వెళ్తున్నారు. అయితే.. బలవంతపు మత మార్పిళ్లకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ భజరంగ్ దళ్​ కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే... సరైన ఆధారాలు లేనందున వారిని విడిచిపెట్టగా, మరో రైలులో వెళ్లిపోయారని సంబంధిత అధికారులు తెలిపారు.

ఖండించిన విజయన్​..

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్​.. ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. రాజ్యాంగ ప్రసాదించిన వ్యక్తిగత స్వేచ్ఛ హక్కును కాలరాసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. ఈ మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఆయన లేఖ రాశారు.

" నలుగురు మహిళలను భజరంగ్ దళ్​ కార్యకర్తలు అడ్డగించి, వారిపై బెదిరింపులకు పాల్పడ్డారు. బలవంతంగా మతమార్పిడి చేస్తున్నారని ఆరోపిస్తూ భజరంగ్​ దళ్​ కార్యకర్తలు ఫిర్యాదు చేయగా.. నలుగురు మహిళలను పోలీసులు బలవంతంగా రైలు నుంచి కిందకు దింపారు. ఇలాంటి ఘటనలు దేశ ప్రతిష్ఠను దెబ్బతీస్తాయి. కేంద్రం దీనిని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది."

-పినరయి విజయన్​, కేరళ ముఖ్యమంత్రి

అంతకుముందు మీడియా సమావేశంలో ఉత్తర్​ప్రదేశ్​లోని భాజపా ప్రభుత్వంపై విజయన్​ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు విజయన్. మతం పేరుతో హింసకు పాల్పడే ఘటనలు ఉత్తర్​ప్రదేశ్​లో ఎక్కువగా జరుగుతున్నాయని విమర్శించారు.

'ఆర్​ఎస్​ఎస్​ వ్యూహమే'

ఈ వేధింపుల ఘటనపై కాంగ్రెస్​ అగ్ర నేత రాహుల్ గాంధీ.. ట్విట్టర్​ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనార్టీలను అణచివేసేందుకు ఆర్​ఎస్​ఎస్ జరుపుతున్న విద్వేష ప్రచారంలో భాగంగానే ఈ ఘటన జరిగిందని ఆరోపించారు.

"మైనార్టీలను అణచివేయాలని ఆర్​ఎస్​ఎస్​ అమలు చేస్తున్న విద్వేష ప్రచారంలో భాగంగానే ఈ ఘటన జరిగింది. అటువంటి విభజన శక్తులను ఓడించడానికి, ఆత్మపరిశీలన చేసుకుని, దిద్దుబాటు చర్యలు తీసుకోవలసిన సమయం ఆసన్నమైంది.

-రాహుల్ గాంధీ.

'తప్పకుండా చర్యలు తీసుకుంటాం'

ఈ ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్​ షా స్పందిచారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కేరళలోని కంజిరప్పల్లిలో ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు.

"కేరళ ప్రజలకు నేను హామీ ఇస్తున్నాను. ఈ ఘటనకు కారణమైన దోషులపై తగిన చర్యలు తీసుకుంటాం."

- కేంద్ర హోం మంత్రి అమిత్​ షా

ఇదీ చూడండి:'నోటీసులు ఇవ్వకుండా అర్ణబ్​ను అరెస్టు చేయొద్దు'

Last Updated : Mar 24, 2021, 10:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.