ETV Bharat / bharat

టీకా పంపిణీపై ఎవరెవరు ఏమన్నారంటే..?

author img

By

Published : Jan 16, 2021, 6:52 PM IST

Updated : Jan 16, 2021, 7:08 PM IST

భారత్​లో కొవిడ్ టీకా ప్రారంభంపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సామాజిక మాధ్యమాల్లో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. కేంద్ర హోం మంత్రి అమిత్​ షా సహా పలువురు కేంద్ర మంత్రులు కూడా ఈ కార్యక్రమంపై హర్షం వ్యక్తం చేశారు. తొలి వ్యాక్సిన్​ పొందిన వారు ఈ సందర్భంగా తమ అనుభవాలను పంచుకున్నారు.

vice-president-and-central-ministers-on-vaccine-launch
టీకా ప్రారంభంపై కేంద్ర మంత్రులు హర్షం

దేశవ్యాప్తంగా కొవిడ్ టీకా పంపిణీ కార్యక్రమంపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సహా పలువురు కేంద్ర మంత్రులు హర్షం వ్యక్తం చేశారు. శనివారం జరిగిన ఈ కార్యక్రమాన్ని 'రెడ్​ లెటర్​ డే(గొప్ప కార్యం జరిగిన రోజు)' గా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభివర్ణించారు.

"కొవిడ్​పై పోరులో మైలురాయిని చేరుకోవడం ద్వారా భారత్ చరిత్ర సృష్టించింది. ఇది ప్రతి భారతీయుడు గర్వపడాల్సిన క్షణం. వ్యాక్సిన్​ను శరవేగంగా​ రూపొందించడంలో విశేష కృషి చేసిన శాస్త్రవేత్తలు అందరికీ నా అభినందనలు."

-వెంకయ్యనాయుడు, ఉపరాష్ట్రపతి

  • मोदी जी के नेतृत्व वाला यह ‘नया भारत’ आपदाओं को अवसर में और चुनौतियों को उपलब्धियों में बदलने वाला भारत है।

    यह 'मेड इन इंडिया' वैक्सीन इसी आत्मनिर्भर भारत के संकल्प की परिचायक हैं।

    इस ऐतिहासिक दिन पर मैं हमारे सभी कोरोना योद्धाओं को कोटि-कोटि नमन करता हूँ।#LargestVaccineDrive

    — Amit Shah (@AmitShah) January 16, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"ప్రధాని మోదీ ఆధ్వర్యంలోని నూతన భారతం విపత్కర పరిస్థితులను అవకాశాలుగా మలుచుకుంటోంది. ఈ మేడ్​ ఇన్​ ఇండియా వ్యాక్సిన్​ ఆత్మనిర్భర్​ భారత్​కు నిదర్శనం. కొవిడ్ వారియర్స్ అందరికీ నా ధన్యవాదాలు.''

-అమిత్ షా, కేంద్ర హోం మంత్రి

"ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్​ పంపిణీ ప్రక్రియ ప్రారంభమైన సందర్భంగా భారత్​కు అభినందనలు.''

-హర్షవర్ధన్​, కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి

vice-president-and-central-ministers-on-vaccine-launch
కేంద్రమంత్రి రవిశంకర్ ట్వీట్

"కొవిడ్​పై పోరులో భారత్​ ఆత్మనిర్భర్​గా మారింది. మోదీ నాయకత్వానికి నా అభినందనలు. వందే మాతరం"

-రవిశంకర్ ప్రసాద్, కేంద్ర న్యాయశాఖ మంత్రి

తొలి టీకా అనుభవాలు..

తొలి టీకా తీసుకున్న పలువురు తమ అనుభవాన్ని పంచుకున్నారు.

"తోటి ఉద్యోగులు టీకా తీసుకోవడానికి భయపడ్డారు. నా భార్య కూడా నేను టీకా తీసుకోవడానికి ఒప్పుకోలేదు.

వాళ్ల భయాన్ని పోగొట్టేందుకు నేను టీకా తీసుకున్నాను."

-మనీష్ కుమార్, దిల్లీలో తొలి టీకా పొందిన వ్యక్తి.

"ఇది మానవాళికి గొప్ప రోజు. తొలి డోసు నాకు అందడంపై గర్వంగా ఉంది."

-బిపాషా సేత్, బంగాల్​లో తొలి టీకా పొందిన వ్యక్తి

"ఈ టీకాపై నాకు ఎలాంటి అనుమానాలు లేవు. అందరూ వ్యాక్సిన్​ వేయించుకోవాలి."

-అశోక్ భాయ్​, గుజరాత్​లో తొలి టీకా పొందిన వ్యక్తి

సీఎంల మాట..

"అందరు రెండు డోసులు తీసుకోవాలి. రెండవ డోసు తీసుకున్న రెండు వారాలకి యాంటీబాడీలు ఏర్పడతాయి. టీకా ప్రభావం చూపాలంటే అందరూ నెలన్నర వరకు ఓపిక పట్టాలి."

-త్రివేంద్ర సింగ్ రావత్, ఉత్తరాఖండ్ సీఎం

"ఇది ఒక విప్లవాత్మక అడుగు. కరోనా యోధులు అందరికీ నా వందనాలు."

-ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర సీఎం

"అందరూ తప్పనిసరిగా టీకా వేయించుకోవాలి. మీరు, నేను కూడా వ్యాక్సినేషన్ చేయించుకోవాలి. మన కుటుంబసభ్యులకు కూడా టీకా వేయించాలి."

-పళనిసామి, తమిళనాడు సీఎం

టీకాతో మహమ్మారి అంతం కాదు..

"ఈ వ్యాక్సిన్​తో మహమ్మారి అంతం కాదు. మనం టీకా వేయించుకున్నాక కూడా కొవిడ్​ మార్గదర్శకాలను పాటించాలి."

-కెకె శైలజ, కేరళ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి

పూనావాలా ఏమన్నారు..

"ఈ చరిత్రాత్మక ప్రయత్నంలో భాగమైన కొవిషీల్డ్​కు ఆమోదం వచ్చినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. నేను కూడా మా ఆరోగ్య కార్యకర్తలతో పాటు టీకా తీసుకున్నాను."

-అదర్ పూనావాలా, సీరమ్ సంస్థ సీఈఓ

ఇదీ చదవండి : కొవిడ్ టీకా సంజీవనిలా పనిచేస్తుంది: హర్షవర్ధన్

Last Updated : Jan 16, 2021, 7:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.