ఉత్తర్‌ప్రదేశ్‌లోని చిత్రకూట్‌కు చెందిన 24ఏళ్ల యువతి అనుమానస్పద స్థితిలో మరణించింది. ఒంటరిగా బయటకు వెళ్లి విగతజీవిగా మారిన తమ కూతురును చూసి తల్లిదండ్రులు బోరున విలపించారు.
బహిర్భూమికి వెళ్లిన కూతురు ఎంతకీ తిరిగిరాలేదని.. వెతుకుతూ వెళ్లిన తమకు సమీప పంటపొలాల్లో మృతదేహం కనిపించిందని తల్లిదండ్రులు వాపోయారు. యువతిని అత్యాచారం చేసి హత్య చేశారని ఆరోపించారు. సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దగ్గర్లోని పంటపొలాల్లో గురువారం రాత్రి.. యువతి మృతదేహాన్ని కనుగొన్నామని చిత్రకూట్ పోలీసు అధికారి గులాబ్ త్రిపాఠి తెలిపారు. గొంతుకోసి చంపినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని అన్నారు. సంఘటనా స్థలంలో యువతి ఒంటిపై దుస్తులు సైతం సరిగా లేవని.. పోస్టుమార్టం నివేదిక తర్వాతే పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.
ఇదీ చదవండి: ఏడేళ్ల బాలికపై హత్యాచారం- మామపై అనుమానం