ETV Bharat / bharat

మలివయసులోనూ పెన్నూ, పేపరు చేతపట్టి..

author img

By

Published : Mar 22, 2021, 8:25 AM IST

ప్రతి ఊర్లో రచ్చబండ ఉంటుంది. అక్కడ వృద్ధులు, ఇతరులు సరదాగా కూర్చుని కాలక్షేపం చేస్తుంటారు. కానీ.. ఓ గ్రామంలోని మహిళలు అందుకు భిన్నం. వృద్ధాప్యంలో పెన్నూ, పేపర్ చేతపట్టి చదువు నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. నాడు చదువుకు దూరమైన వారు.. మనవలు, మనవరాళ్లను ఎత్తుకునే దశలో నేడు ఎంతో ఆసక్తిగా అక్కడికి వచ్చి అక్షరాలను నేర్చుకుంటున్నారు. ఇంతకీ ఎవరా మహిళలు? ఆ ఊరు ఎక్కడుంది? ఓ సారి తెలుసుకుందాం.

Uttarakhand: Uttara Kashi women learning to read at an old age to go to Rachhabanda
మలివయసులోనూ పెన్నూ, పేపరు చేతపట్టి..

రచ్చబండ వద్దకు వెళ్లి చదువు నేర్చుకుంటున్న ఉత్తరకాశీ మహిళలు

ఇక్కడ కనిపిస్తున్న మహిళలంతా జీవితాల్లో 60కిపైగా వసంతాలను చూసినవాళ్లే. అక్షరాలు నేర్చుకునే మనవలు, మనవరాళ్లున్న ఈ వయసులో.. ఈ అమ్మమ్మలు, నానమ్మలు పెన్ను చేతబట్టి, చదువు నేర్చుకుంటున్నారు. అక్షరాస్యులిగా మారేందుకు ఎంతో ఆసక్తితో కష్టపడుతున్నారు.

"నా పిల్లలు చదువుకుంటుంటే, రాస్తుంటే చూసేదాన్ని. ఇప్పుడైతే నా పేరు రాయడం నేర్చుకున్నా. అంతకు ముందు వేలిముద్ర వేసేదాన్ని."

- రాంప్యారీ, గ్రామస్థురాలు

"ప్రతి ఒక్కరూ చదవాలనుకుంటారు. ఎక్కడికైనా వెళ్తే ఇకపై వేలిముద్ర వెయ్యాల్సిన అవసరం లేదు."

- మీనాదేవి, స్థానికురాలు

రచ్చబండకు వచ్చి..

ఉత్తరాఖండ్​లోని ఉత్తరకాశికి చెందిన మహిళలు వీళ్లంతా. ఒకప్పుడు కుటుంబ బాధ్యతలతో క్షణం తీరిక లేకుండా గడిపిన వీళ్లు.. మలివయసులో ఇంటి బయటకు వచ్చి, తమ కోసం తాము చదవడం, రాయడం నేర్చుకుంటున్నారు. ప్రతిరోజూ ఇంటిపనంతా పూర్తిచేసుకుని, స్నేహితురాళ్లతో కలిసి రచ్చబండ వద్దకు వస్తారు. తమతో పాటు పెన్సిళ్లు, నోట్​ పుస్తకాలు తెచ్చుకుంటారు.

"అప్పట్లో వేలిముద్ర వేసేవాళ్లం. ఎలా చదవాలో, ఎలా రాయాలో నాకు తెలిసేది కాదు. ఇప్పుడు కష్టపడి చదువుకుంటున్నాం."

- నారాయణీ దేవి, గ్రామస్థురాలు

"ఇదంతా మా మంచి కోసమే కదా. మేం చదువుకుంటున్నాం. నా పేరు ఎలా రాయాలో నేర్చుకున్నా. ఇంతకు మునుపైతే వేలిముద్ర వేసేదాన్ని."

- సోనాదేవి, గ్రామస్థురాలు

ఉత్సాహంగా..

ప్రతి ఊర్లో ఓ రచ్చబండ ఉంటుంది. కానీ దాని వేదికగా ముసలివాళ్లంతా చదువు నేర్చుకోవడం మాత్రం అరుదుగా కనిపించే దృశ్యం. భట్వాడీ బ్లాక్​లోని లోంతరూ, సిరోర్ గ్రామాల్లోని మహిళల్లో చదువుకోవాలన్న ఆసక్తి మెండుగా ఉంది. ఉత్తరకాశీ జిల్లా యంత్రాంగం మొదలుపెట్టిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో రెండు గ్రామాల పెద్ద వయసు మహిళలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. కుటుంబ పరిస్థితుల కారణంగా, చదువుకోవాల్సిన వయసులో చదువుకు దూరమైన వీళ్లు.. మొత్తానికి పెన్ను పేపరు పట్టారు.

"ముందుగా అక్షరాలు నేర్చుకున్నాం. ఇప్పుడు పూర్తి పుస్తకాన్ని చదివేందుకు కష్టపడుతున్నాం."

- బిజ్లా దేవి, గ్రామస్థురాలు

భట్వాడీ బ్లాక్​లో మొత్తంగా 3,115 మంది నిరక్షరాస్యులున్నారు. వీరి కోసం జిల్లా యంత్రాంగం ఓ ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. పెద్ద వయసు మహిళలతో అక్షరాలు దిద్దించేందుకు ఓ విభాగాన్ని కేటాయించింది.

ఇదీ చదవండి: కళ్లు లేకపోయినా 40 ఏళ్లుగా మిల్లు నడుపుతూ..

"భట్వాడీ బ్లాక్​లో పూర్తి అక్షరాస్యత సాధించేందుకు ప్రత్యేక కార్యక్రమం మొదలుపెట్టాం. 2021 జూన్​లోగా చదువుకోలేని మహిళలు, పురుషులందరి చేతా అక్షరాలు దిద్దించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం. బ్లాక్​లోని ప్రతి ఒక్కరినీ అక్షరాస్యులుగా మార్చాలి. విద్యాశాఖ నుంచి వలంటీర్లు ఊర్లలోకి వెళ్లి, వారికి చదువు చెప్తున్నారు. కావాల్సిన పుస్తకాలు అందిస్తున్నాం. రాసేందుకు కావల్సిన సామగ్రి కూడా ఏర్పాటు చేస్తున్నాం. మహిళల నుంచి మంచి స్పందన వస్తోంది."

- మయూర్ దీక్షిత్, జిల్లా మేజిస్ట్రేట్

"గతేడాది డిసెంబరు నుంచి ఈ మిషన్​పై పనిచేస్తున్నాం. ఇంటింటికీ వెళ్లి, ఒక్కొక్కరికీ నేర్పించడం చాలా ఆనందంగా ఉంది."

- మమతా భన్సాల్, వలంటీరు

"ఇందుకోసం కావల్సిన స్టేషనరీ అంతా సిద్ధంగా ఉంచాం. మహిళలందరూ తమ పేర్లు రాయడం నేర్చుకున్నాక, పుస్తకాలు చేతికిచ్చాం. ఆ పుస్తకాలు చదువుతున్నారు, రాస్తున్నారు. మెల్లమెల్లగా ప్రతిఒక్కరూ రాయడం, చదవడం నేర్చుకుంటున్నారు."

- వినీతా మఖ్లోగా, వలంటీరు

దేశంలో మూడో స్థానంలో..

జాతీయ గణాంకాల కార్యాలయం 2020లో నిర్వహించిన ఓ సర్వే ప్రకారం.. అక్షరాస్యత రేటులో కేరళ తర్వాత, 88.7 శాతంతో దిల్లీ దేశంలో రెండో స్థానంలో ఉంది. 87.6 శాతంతో ఉత్తరాఖండ్​ మూడో స్థానంలో నిలిచింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అక్షరాస్యత శాతంలో ఊహించని మార్పే వస్తుంది.

ఇదీ చదవండి: 5వేలకుపైగా ప్రసవాలు చేసిన 103 ఏళ్ల బామ్మ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.