ETV Bharat / bharat

కూలీలకు మరింత చేరువ- 14మీటర్లు తవ్వితే సేఫ్​గా బయటకు! సొరంగం వద్ద అంబులెన్సులు రెడీ

author img

By PTI

Published : Nov 22, 2023, 3:17 PM IST

Uttarakhand Tunnel Collapse Rescue : ఉత్తరాఖండ్‌ సొరంగ ప్రమాదంలో చిక్కుకుపోయిన 41మంది కూలీలను బయటకు తీసుకొచ్చేందుకు సహాయ బృందాలు మరో 14 మీటర్ల దూరంలో ఉన్నాయి. గురువారం నాటికి మిగిలిన 14 మీటర్ల డ్రిల్లింగ్ పూర్తి చేసి కూలీలను బయటకు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. పనులన్నీ ఆశావహంగా సాగుతున్నాయని చెబుతున్నారు. కూలీల బంధువులు కూడా గురువారం తమవారు బయటకు వస్తారని భావిస్తున్నారు.

Uttarakhand Tunnel Collapse Rescue
Uttarakhand Tunnel Collapse Rescue

Uttarakhand Tunnel Collapse Rescue : ఉత్తరాఖండ్‌ సొరంగ ప్రమాదంలో 11 రోజులుగా చిక్కుకుపోయిన 41 మంది కూలీలను బయటకు తీసుకొచ్చేందుకు సహాయ బృందాలు మరింత దగ్గరయ్యాయి. సిల్‌క్యారా వద్ద అమెరికన్ ఆగర్ యంత్రంతో మంగళవారం రాత్రి నుంచి పునఃప్రారంభమైన డ్రిల్లింగ్ నిరాటంకంగా కొనసాగుతోంది. కూలీలకు, సహాయ బృందాలకు మధ్యలో కొండలా ఉన్న శిథిలాలను ఆగర్ యంత్రంతో సమాంతర డ్రిల్లింగ్ చేస్తున్నారు. 800MM వ్యాసార్థం ఉన్న స్టీల్ పైపును శిథిలాల ద్వారా 39 మీటర్లు లోపలికి చొప్పించారు.

  • #WATCH | Uttarkashi Tunnel Rescue | Additional Secretary Technical, Road and Transport Mahmood Ahmed says, "An additional 800 mm pipe has also been pushed 21 metres inside the tunnel. Around 12:45 am, we started drilling through the auger machine and so far, we have pushed three… pic.twitter.com/BA6couNOHV

    — ANI (@ANI) November 22, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

మరో 14 మీటర్లే.. గురువారం నాటికి పని పూర్తి!
Uttarakhand Tunnel Collapse Latest News : గురువారం నాటికి మిగిలిన డ్రిల్లింగ్ పూర్తి చేసి.. ఆ పైపు ద్వారా కూలీలను బయటకు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నట్లు PMO మాజీ సలహాదారు భాస్కర్ ఖుల్బే చెప్పారు. మరో, 14 మీటర్లు పైపును చొప్పిస్తే కూలీల వద్దకు చేరుకోవచ్చని భాస్కర్‌ తెలిపారు.

Uttarakhand Tunnel Collapse Rescue
భారీ యంత్రంతో సహాయక చర్యలు
uttarakhand tunnel collapse
భారీ పైపులను తీసుకెళ్తున్న క్రేన్

డ్రిల్లింగ్ మళ్లీ షురూ
ఆగర్ యంత్రం ఏదో గట్టి వస్తువును ఢీకొనడం వల్ల శుక్రవారం సొరంగం వద్ద డ్రిల్లింగ్ నిలిపివేశారు. మళ్లీ మంగళవారం రాత్రి నుంచి డ్రిల్లింగ్ చేపట్టారు. పనులు ఆశావహంగా సాగుతున్నట్లు కేంద్ర రోడ్డు రవాణాశాఖ అదనపు కార్యదర్శి మహమూద్ అహ్మద్‌ చెప్పారు. మధ్యలో ఎలాంటి అవాంతరం రాకుంటే 24 గంటల్లోపు మంచి వార్త వింటామని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. సోమవారం రాత్రి 6 అంగులాల వ్యాసమున్న గొట్టం ప్రవేశపెట్టినప్పటి నుంచి కార్మికులతో మాట్లాడే సౌలభ్యం కలిగింది. ఆ గొట్టం ద్వారా వారికి వేడివేడి ఆహార పదార్థాలను పంపుతున్నారు. నిరంతరం వారితో మాట్లాడుతూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

రంగంలోకి అంబులెన్సులు
గురువారం కల్లా కూలీలు బయటకొస్తారని వారి కోసం ఈనెల 12 నుంచి ఎదురుచూస్తున్న వారి బంధువులు ఆశాభావంతో ఉన్నారు. 41 మంది కూలీలను సురక్షితంగా బయటకు తీసే అవకాశాలు మెరుగుపడిన నేపథ్యంలో.. పూర్తిసౌకర్యాలతో కూడిన అంబులెన్సులను సొరంగం బయట అందుబాటులో ఉంచారు. సిద్ధంగా ఉండాలని వైద్యులు, ఆంబులెన్స్ సిబ్బందికి అధికారులు సూచించారు.

  • #WATCH | Uttarkashi (Uttarakhand) tunnel rescue | Ambulances have been stationed at the incident site.

    A part of the Silkyara tunnel collapsed in Uttarkashi on November 12 and 41 workers are stranded inside the tunnel pic.twitter.com/szwypMbpfX

    — ANI (@ANI) November 22, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="

#WATCH | Uttarkashi (Uttarakhand) tunnel rescue | Ambulances have been stationed at the incident site.

A part of the Silkyara tunnel collapsed in Uttarkashi on November 12 and 41 workers are stranded inside the tunnel pic.twitter.com/szwypMbpfX

— ANI (@ANI) November 22, 2023 ">
  • #WATCH | Uttarkashi (Uttarakhand) tunnel rescue | Two more Ambulances have reached the Silkyara tunnel site, as the rescue operation to bring out 41 workers trapped inside, continues.

    A part of the tunnel collapsed in Uttarkashi on November 12. pic.twitter.com/3QxGHyhiGV

    — ANI (@ANI) November 22, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

మానసిక స్థితి ఎలా ఉంటుందో?
చాలా రోజులుగా చిక్కుకుపోయిన 41 మంది కూలీల శారీరక, మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో వైద్యులు అంచనా వేయనున్నారు. అవసరాన్ని బట్టి వారిని ఆసుపత్రులకు తరలించనున్నారు. నవంబర్ 12న ఉత్తరకాశీలోని సిల్‌క్యారా టన్నెల్‌ వద్ద కొండచరియలు విరిగిపడి అక్కడ పనులు చేస్తున్న 41మంది కూలీలు సొరంగంలో చిక్కుకుపోయారు. అప్పటి నుంచి వారిని సురక్షితంగా తీసుకొచ్చేందుకు సహాయ చర్యలు కొనసాగిస్తున్నారు.

Uttarakhand Tunnel Collapse Rescue
సొరంగం వద్ద సహాయక చర్యలు

కూలీలకు వేడివేడి కిచిడీ- బాటిళ్లలో నింపి లోపలకు- సొరంగంలోని కార్మికుల లైవ్​ వీడియో

విషాదం- సొరంగం కూలి 9 మంది మృతి- రంగంలోకి అత్యవసర బృందాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.