ETV Bharat / bharat

ఉత్తరాఖండ్​కు కొత్త సీఎం- మూడు నెలలకే మార్పెందుకు?

author img

By

Published : Jul 2, 2021, 11:10 AM IST

Updated : Jul 2, 2021, 11:35 AM IST

కొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరాఖండ్​లో​ రాజకీయాలు మారోమారు రసవత్తరంగా మారాయి. ముఖ్యమంత్రి మార్పుపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఇటీవల సీఎం తీరథ్​​ సింగ్​ రావత్​.. అత్యవసరంగా దిల్లీకి వెళ్లటం అందుకు ఆజ్యం పోసినట్లయింది. అధికారం చేపట్టిన మూడు నెలలకే ముఖ్యమంత్రి మార్పు అంశం తెరపైకి ఎందుకు వచ్చింది? రాష్ట్రంలో మరోమారు సీఎం మార్పు తప్పదా? అసలు కారణాలేంటి?

Uttarakhand may get a new CM soon
ఉత్తరాఖండ్​ ముఖ్యమంత్రి

అసెంబ్లీ ఎన్నికల వేళ.. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పీఠం విషయంలో అధికార భాజపాకు మరోమారు చిక్కులు మొదలయ్యాయి. త్రివేంద్ర సింగ్​ రావత్​పై సొంత పార్టీ ఎమ్మెల్యేల్లో అసంతృప్తి వ్యక్తమైన క్రమంలో.. తీరథ్​ సింగ్​ రావత్​ను సీఎం పీఠంపై కూర్చోబెట్టింది అధిష్ఠానం. అయితే.. తీరథ్​కు రాష్ట్ర పగ్గాలు అప్పగించిన మూడు నెలల్లోనే మరోమారు సీఎం మార్పుపై వార్తలు రావటం గమనార్హం. భాజపా హైకమాండ్​ తీరథ్​ను అత్యవసరంగా దిల్లీ పిలిపించటంతో ఆ ఊహాగానాలకు ఆజ్యం పోసినట్లయింది. కొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పుడు ముఖ్యమంత్రిని మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది.

ముఖ్యమంత్రి తీరథ్​​ సింగ్​ రావత్​.. కేంద్ర హోంమంత్రి అమిత్​ షాతో దిల్లీలోని ఆయన నివాసంలో గురువారం సమావేశమయ్యారు. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పార్టీ సీనియర్​ నేతలు హాజరైన ఈ భేటీ అర్ధరాత్రి వరకు సుదీర్ఘంగా కొనసాగింది. ఇద్దరు ఎమ్మెల్యేలు మృతి చెందటం వల్ల ఖాళీ ఏర్పడిన హల్ద్వానీ, గంగోత్రి సీట్లపై చర్చించినట్లు సమాచారం. అలాగే భవిష్యత్​లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలను కూడా చర్చించినట్లు తెలుస్తోంది.

ఎమ్మెల్యేగా గెలిస్తేనే..

త్రివేంద్ర సింగ్​ రావత్​ను సీఎంగా తొలగించిన అనంతరం లోక్​ సభ సభ్యుడైన తీరథ్​ సింగ్​ రావత్​ను ముఖ్యమంత్రిగా నియమించారు. ఈ ఏడాది మార్చిలో సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అయితే.. తీరథ్​ ముఖ్యమంత్రిగా కొనసాగాలంటే ఆరు నెలల్లోపు రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికవ్వాల్సి ఉంటుంది. సెప్టెంబర్​ 9లోపు అది పూర్తికావాలి. కానీ, కరోనా మహమ్మారి కారణంగా ఉప ఎన్నికలు నిర్వహించలేమని మే 5నే తేల్చి చెప్పింది కేంద్ర ఎన్నికల సంఘం. మరోవైపు.. ఏడాది లేదా ఆలోపే ఏ రాష్ట్రంలోనైనా సాధారణ ఎన్నికలే జరగాలని తెలిపింది. ఈ కారణంతో రాష్ట్రంలో ఇప్పట్లో ఉప ఎన్నికలు జరిగే పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో భాజపా అధిష్ఠానం వద్ద ఉన్న ఒకే ఒక అవకాశం ముఖ్యమంత్రిని మార్చటం.

తీరథ్​​ సింగ్​ రావత్​ సాల్ట్​ అసెంబ్లీ సీటు నుంచి పోటీ చేసి ఉంటే.. ప్రస్తుతం ఈ పరిస్థితి ఉండేది కాదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

కొత్త సీఎం ఎవరు?

ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే.. ముఖ్యమంత్రిని మార్చాలనే దృఢ నిశ్చయంతో భాజపా అధిష్ఠానం ఉన్నట్లు కనిపిస్తోంది. ఒకవేళ.. ఇప్పట్లో మార్పు చేకపోతే.. తన పదవీ కాలం 6 నెలలు ముగియగానే(సెప్టెంబర్​ 9) తీరథ్​ సింగ్​ రాజీనామా చేయాలి. ఆ తర్వాత ఎన్నికలకు మూడు నెలలు మాత్రమే సమయం ఉంటుంది.

ఏదేమైనా.. తీరథ్​ సింగ్​ రావత్​ రాజీనామా చేస్తే ఆ తర్వాత ఎవరు ఆ పదవి చేపడతారు? అనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ విషయంలో ఇప్పటికీ ఎలాంటి స్పష్టత లేదు. కానీ, రాష్ట్రంలో భారీ మార్పు జరిగే అవకాశం ఉందని స్పష్టంగా తెలుస్తోంది.

ఇదీ చూడండి: మొన్న జీన్స్‌.. ఇవాళ అమెరికా.. మళ్లీ వార్తల్లోకి సీఎం

ఉత్తరాఖండ్​ సీఎంగా తీరథ్​ సింగ్​​ ప్రమాణం

Last Updated : Jul 2, 2021, 11:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.