ఉత్తరాఖండ్‌లో శనివారం సంభవించిన అకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 15కు చేరింది. చమోలీ జిల్లాలో సంభవించిన వరదల్లో చిక్కుకున్న 10 మంది మృతదేహాలను శనివారం వెలికి తీసిన అధికారులు... ఆదివారం రెండు, సోమవారం మూడు మృతదేహాలను గుర్తించారు. ఇంకా మూడు మృతదేహాల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేసినట్లు చమోలీ జిల్లా విపత్తు నిర్వాహణ అధికారి ఎన్కే జోషీ తెలిపారు.
ఉత్తరాఖండ్‌లో 5 రోజులుగా భారీ వర్షం కురుస్తుండగా.. జోషీమఠ్-మలారీ మధ్య రహదారి నిర్మాణ పనుల్లో నిమగ్నమైన కార్మికుల శిబిరాలను వరదలు ముంచెత్తాయి. కార్మికులను రక్షించేందుకు రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఐటీబీపీ సహాయక బృందాలు.. 384 మంది కార్మికులను కాపాడాయి.
ఇదీ చదవండి : ఇద్దరు హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులు అరెస్ట్