ETV Bharat / bharat

పరికరం అమర్చి ఏటీఎంల్లో వరుస చోరీలు, చివరకు చిక్కాడిలా - కేరళలో ఏటీఎం దొంగతనం

ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన ఓ వ్యక్తి కేరళలో 11 ఏటీఎంలలో దొంగతనాలకు పాల్పడ్డాడు. ఓ ప్రైవేట్ బ్యాంకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడు ఓ రకమైన పరికరం అమర్చి ఈ దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.

atm robbery
ఏటీఎంలో దొంగతనం
author img

By

Published : Aug 27, 2022, 12:08 PM IST

ఏటీఎంలో దొగతనం చేస్తున్న ముబారక్ అలీ

ATM Robbery: కేరళలోని కొచ్చి ఏటీఎంలలో డబ్బు దొంగిలించినందుకు పోలీసులు ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. నిందితుడిని ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన ముబారక్ అలీ అన్సారీగా (40) గుర్తించారు. ఓ ప్రైవేట్ బ్యాంక్ నుంచి వచ్చిన ఫిర్యాదు ఆధారంగా.. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి అతడిని అదుపులోకి తీసుకున్నట్లు ఎడపల్లి పోలీసులు తెలిపారు. ఏటీఎం మిషన్​లో ఓ పరికరాన్ని అమర్చి అలీ.. ఇతరుల డబ్బు దొంగిలించేవాడని చెప్పారు.

mubharak ali
పరికరాలతో ముబారక్​ అలీ

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అలీ అన్సారీ అనే వ్యక్తి కొచ్చిలోని 11 ఏటీఎంల నుంచి డబ్బు దొంగిలించాడు. ఏటీఎం మిషన్​లో ఓ పరికరాన్ని అమర్చి.. ఆగస్టు 18 నుంచి ఇలా చోరీలకు పాల్పడుతున్నాడు. దాని ద్వారా ఎవరైనా డబ్బులు తీయడానికి వస్తే వారి అకౌంట్​లో నగదు కట్​ అవుతుంది కానీ, ఏటీఎం నుంచి మనీ బయటకు రాదు. తరువాత అలీ ఏటీఎంలోపలికి వెళ్లి ఆ పరికరాన్ని తొలగించి.. వారి డబ్బును దొంగిలించేవాడు. నిందితుడు 2018లో ముంబయిలో డ్రైవర్‌గా పని చేసేవాడు. అప్పుడే ఏటీఎం నుంచి డబ్బు దొంగిలించడం గురించి కొన్ని ప్రాథమిక విషయాలను తెలుసుకుని ఈ చోరీలకు పాల్పడ్డాడు. అలీ గతంలో ఓసారి అరెస్టు కూడా అయినట్లు పోలీసులు తెలిపారు.

robbery
ఏటీఎం మిషన్​లో పరికరం అమర్చి డబ్బు దొంగతనం చేస్తున్న అలీ

ఇవీ చదవండి: భారత ప్రధాన న్యాయమూర్తుల్లో 9 మంది దక్షిణాది వారే

దళితుడిపై మూకదాడి, బలవంతంగా మూత్రం తాగించి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.