ETV Bharat / bharat

UPSC Engineering Jobs : ప్రభుత్వ విభాగాల్లో 167 ఇంజినీరింగ్​ ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోండిలా! - ఇండియన్​ ఇంజినీరింగ్ సర్వీసెస్​ జాబ్స్​ 2023

UPSC Engineering Jobs In Telugu : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్​ 167 ఇంజినీరింగ్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులకు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్హతలు, వయోపరిమితి, ఫీజు, దరఖాస్తు విధానం తదితర పూర్తి వివరాలు మీ కోసం.

UPSC Recruitment 2023 for 167 Engineering Jobs
UPSC Engineering Jobs
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 11, 2023, 10:25 AM IST

UPSC Engineering Jobs : ఇంజినీరింగ్, డిప్లొమాలు చేసి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు శుభవార్త. యూనియన్​ పబ్లిక్​ సర్వీస్ కమిషన్ (UPSC) 167 ఇంజినీరింగ్​ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఉద్యోగాలు - విభాగాలు
UPSC Engineering Services Vacancy : సివిల్​, మెకానికల్​, ఎలక్ట్రికల్​, ఎలక్ట్రానిక్స్​ & టెలికమ్యునికేషన్​ ఇంజినీరింగ్ విభాగాల్లో ఉద్యోగాలు ఉన్నాయి.

విద్యార్హతలు
UPSC IES Eligibility : ఆయా పోస్టులను అనుసరించి అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా విద్యా సంస్థ నుంచి బీఈ, బీటెక్​, డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. లేదా ఆయా పోస్టులను అనుసరించి ఎంఎస్సీ (వైర్​లెస్​ కమ్యునికేషన్,​ ఎలక్ట్రానిక్స్​, రేడియో ఫిజిక్స్​, రేడియో ఇంజినీరింగ్​)లో క్వాలిఫై అయ్యుండాలి.

వయోపరిమితి
UPSC IES Age Limit : అభ్యర్థుల వయస్సు 2024 జనవరి 1 నాటికి 21 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి.

దరఖాస్తు రుసుము
UPSC IES Application Fee : జనరల్, ఓబీసీ అభ్యర్థులు అప్లికేషన్​ ఫీజుగా రూ.200 ఆన్​లైన్​లో చెల్లించాలి. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగులకు మాత్రం దరఖాస్తు రుసుము నుంచి పూర్తి మినహాయింపు ఇచ్చారు.

ఎంపిక ప్రక్రియ
UPSC IES Selection Process : అభ్యర్థులకు ముందుగా ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ఉత్తీర్ణులైనవారిని మెయిన్ పరీక్షకు ఎంపిక చేస్తారు. ఇందులోనూ క్వాలిఫై అయిన వారికి పర్సనాలిటీ టెస్ట్​, మెడికల్ ఎగ్జామినేషన్​, సర్టిఫికెట్​ వెరిఫికేషన్ చేసి.. ఆయా పోస్టులకు ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం
UPSC IES Application Process : అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వెబ్​సైట్​​ https://upsc.gov.in/ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం యూపీఎస్సీ ఇంజినీరింగ్ జాబ్స్​​ నోటిఫికేషన్​ను చూడండి.

  • ఆంధ్రప్రదేశ్​, తెలంగాణల్లోని ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాలు : విశాఖపట్నం, తిరుపతి, హైదరాబాద్​
  • ఆంధ్రప్రదేశ్​, తెలంగాణాల్లోని మెయిన్ పరీక్ష కేంద్రాలు : విశాఖపట్నం, హైదరాబాద్​

ముఖ్యమైన తేదీలు
UPSC Engineering Services Important Dates :

  • దరఖాస్తు స్వీకరణ ప్రారంభ తేదీ : 2023 సెప్టెంబర్​ 6
  • దరఖాస్తుకు ఆఖరు తేదీ : 2023 సెప్టెంబర్​ 26
  • దరఖాస్తు సవరణకు అవకాశం : 2023 సెప్టంబర్​ 27 నుంచి అక్టోబర్​ 3 వరకు
  • ప్రిలిమినరీ పరీక్ష తేదీ : 2024 ఫిబ్రవరి 18 ​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.