ETV Bharat / bharat

యూపీ తొలిదశ ఎన్నికల్లో 15 మంది నిరక్షరాస్యులు - adr report on up first phase candidates

UP polls phase I: ఉత్తర్​ప్రదేశ్​ ఎన్నికల మొదటి దశ బరిలో ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థుల్లో 15 మంది నిరక్ష్యరాస్యులేనని అసోషియేషన్‌ ఆఫ్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) సంస్థ తెలిపింది. అంతేగాకుండా మరో 125 మంది విద్యార్హత కేవలం 8వ తరగతి అంతకంటే తక్కువ అని స్పష్టం చేసింది.

UP polls phase I
యూపీ తొలిదశ ఎన్నికలు, ఎన్నికల్లో నిరక్ష్యరాస్యులు
author img

By

Published : Feb 6, 2022, 8:18 AM IST

UP polls phase I: యూపీ తొలిదశ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారిలో 15 మంది నిరక్షరాస్యులు. మరో 125 మంది 8వ తరగతి వరకు చదువుకున్నారు. అభ్యర్థుల విద్యార్హతలకు సంబంధించిన నివేదికను శనివారం అసోషియేషన్‌ ఆఫ్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) సంస్థ విడుదల చేసింది. పోటీలో ఉన్న 623 మంది అభ్యర్థుల్లో 615 మంది ప్రమాణపత్రాలను ఈ సంస్థ నిశితంగా విశ్లేషించింది. మిగిలిన 8 మందివి సరిగా స్కాన్‌ కాకపోవడంవల్ల వాటిని పరిశీలించలేకపోయినట్లు పేర్కొంది.

తొలిదశ పోటీలో ఉన్న అభ్యర్థుల్లో 70 మంది 60 ఏళ్ల పైబడిన వారని ఏడీఆర్‌ నివేదిక వెల్లడించింది. మొత్తం 11 జిల్లాల్లో ఉన్న 58 అసెంబ్లీ నియోజకవర్గాలకు తొలిదశలో ఫిబ్రవరి 10న ఎన్నికలు జరగనున్నాయి. ఏడీఆర్‌ పరిశీలనల ప్రకారం.. పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 15 మంది నిరక్షరాస్యులు, 38 మంది అక్షరాస్యులు, 10 మంది ఐదో తరగతి ఉత్తీర్ణులైనవారు ఉన్నారు. మరో 62 మంది ఎనిమిదో తరగతి, 65 మంది పదో తరగతి, 102 మంది 12వ తరగతి వరకు చదువుకున్నారు. 100 మంది పట్టభద్రులు, 78 మంది గ్రాడ్యుయేట్‌ ప్రొఫెషనల్స్‌, 108 మంది పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌, 18 మంది డాక్టరేట్‌, ఏడుగురు డిప్లోమా హోల్డర్లు ఉన్నారు. మరో 12 మంది వారి విద్యార్హతలకు సంబంధించిన వివరాలకు వెల్లడించలేదు. 239 మంది అభ్యర్థులు వారి విద్యార్హతను 5-12వ తరగతి మధ్య ఉన్నట్లు వెల్లడించారు. మరో 304 మంది గ్రాడ్యుయేషన్‌ లేదా అంతకంటే ఎక్కువ చదివినట్లు పేర్కొన్నారు.

ఇక వయసురీత్యా చూస్తే 214 మంది తమ వయసు 25-40 ఏళ్ల మధ్య ఉంటుందని పేర్కొన్నారు. మరో 328 మంది 41-60 ఏళ్లు, 73 మంది తమ వయసు 61-80 ఏళ్లు మధ్య ఉన్నట్లు వెల్లడించారు. తొలి దశలో మొత్తం 58 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు మార్చి 10న వెలువడనున్నాయి.

ఇదీ చూడండి:సవాళ్లు.. సెటైర్లు.. హీటెక్కిన పంజాబ్ అసెంబ్లీ రణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.